అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

Published Mon, Jan 27 2025 7:47 AM | Last Updated on Mon, Jan 27 2025 7:46 AM

అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

అనారోగ్యంతో అంగన్‌వాడీ టీచర్‌ మృతి

బోయినపల్లి(చొప్పదండి): మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన అంగన్‌వాడీ టీచర్‌ మానాల మరియమ్మ (50) అనారోగ్యంతో ఆదివారం మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. టీచర్‌ కుటుంబానికి ఐసీడీఎస్‌ అధికారులు రూ.20 వేలు, అంగన్‌వాడీ టీచర్లు రూ.5వేలు ఆర్థికసాయం అందించారు. మరియమ్మ మృతదేహానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అజ్జ వేణు, ప్రదానకార్యదర్శి కడారి రాములు నివాళి అర్పివంచారు. అంగన్‌వాడీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. ఓరుగంటి శ్యామల, పద్మ, సూర్య, చంద్రకళ, వజ్రమ్మ, లక్ష్మీబాయి, వసంత, అరుంధతి, విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

అనుమానాస్పద స్థితిలో బాలుడు..

మానకొండూర్‌రూరల్‌: మండలంలోని పచ్చునూర్‌ గ్రామానికి చెందిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. పచ్చునూర్‌కు చెందిన కనకం వశీకర్‌ (12) తిమ్మాపూర్‌ మైనార్టీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సెలవులకు పచ్చునూర్‌లోని నాన్నమ్మ ఇంటికి వచ్చాడు. శనివారం పచ్చునూర్‌ నుంచి తన చెల్లెను అమ్మమ్మ గ్రామం కెల్లేడులో వదిలిపెట్టి తిమ్మాపూర్‌ వెళ్తానని ఇంట్లో చెప్పి వచ్చారు. కెల్లేడులోని ఇంట్లో ఊయలకు ఉన్న చీర మెడకు బిగుసుకుపోయి అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. బాలుడి తండ్రి విద్యాసాగర్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.

ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మండలం నిమ్మనపల్లి గ్రామానికి చెందిన వైద తిరుపతి (50) ఆదివారం వేకువజామున ఇంటి ఆవరణలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, బాధ భరించలేక ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని కుటుంబీకులు తెలిపారు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు.

వీణవంకలో మహిళ..

వీణవంక(హుజూరాబాద్‌): మండల కేంద్రానికి చెందిన నీల రమ్య అలియాస్‌ మరుపాక రమ్య(26) భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. రెండేళ్ల క్రితం రమ్య వీణవంకకు చెందిన నీల సాయికిరణ్‌ను కులాంతర వివాహం చేసుకుంది. భర్త రోజూ మద్యం సేవించి కట్నం తీసుకురావాలని మానసికంగా, శారీరకంగా వేధించడంతో ఆదివారం ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మేనమామ కొమ్ము శ్యాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement