5వేల కుటుంబాలకు డబుల్బెడ్రూం ఇళ్లు
జగిత్యాల: ఐదు వేల కుటుంబాలకు డబుల్బెడ్రూంలు మంజూరు కాగా.. దాదాపు 20 వేల మందికి లబ్ధి చేకూరిందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మంగళవారం పొన్నాల గార్డెన్స్‌లో 202 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కింద రూ.2.2 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. పట్టణంలో 18 వేల ఇళ్లకు ఉచిత కరెంట్ పథకం అమలుతోపాటు, రూ.5 కోట్లతో టీఆర్‌నగర్‌లో ఏటీసీ అడ్వాన్స్డ్ స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మెడికల్ కళాశాలకు గతంలో రూ.10 కోట్లు మాత్రమే మంజూరయ్యాయని, త్వరలోనే పూర్తిస్థాయి నిధులు మంజూరవుతాయని తెలిపారు. నూకపల్లి అర్బన్ కాలనీని మున్సిపాలిటీలో కలుపుతామన్నారు. రూ.5 కోట్లతో మహిళా డిగ్రీ కళాశాల నిర్మిస్తామన్నారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి, తహసీల్దార్ రాంమోహన్, గోలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment