నిందితులకు శిక్ష పడేలా చూడాలి
జగిత్యాలక్రైం: నిందితులకు శిక్ష పడేలా చూడడంలో పోలీస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో పోలీస్, పీపీలతో సమావేశమయ్యారు. ఈ ఏడాది 64 కేసుల్లో నిందితులకు జైలు శిక్ష పడిందన్నారు. సాక్షులను సరైన పద్ధతిలో ప్రవేశపెట్టి కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పీపీలు నూతన చట్టాల్లో కలిగే సందేహాలను నివృత్తి చేశారు. అనంతరం పీపీలు రాజేశ్, రజిని, ప్రణయ్, మల్లికార్జున్, మల్లేశం, రామకృష్ణారావును ఎస్పీ అభినందించారు.
ప్రజలకు మంచి సేవలందించాలి
సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రజలకు స మర్థవంతమైన సేవలు అందించాలని ఎస్పీ అన్నారు. తన కార్యాలయంలో నేరాలపై సమీక్షించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చొరవ చూపించాలన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా ప్రజలు, వ్యాపారులకు అవగాహన కల్పించాలన్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని, డయల్ 100కు వచ్చిన ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస, ప్రోత్సాహకాలు అందించారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగారెడ్డి, సీఐలు శ్రీనివాస్, ఆరిఫ్అలీఖాన్, రఫీక్ ఖాన్, వేణుగోపాల్, రామ్ నరసింహారెడ్డి, రవి, నిరంజన్‌రెడ్డి, కృష్ణరెడ్డి, సురేశ్, ఆర్ఐ కిరణ్ కుమార్, వేణు, ఎస్సైలు, డీసీఆర్బీ, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment