నృసింహాలయంలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. మౌన అమావాస్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
అభివృద్ధి పనులకు మార్గదర్శకాలివ్వండి
ధర్మపురి: ధర్మపురి నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మార్గదర్శకాలు జారీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. బుధవారం సీఎం చాంబర్‌లో ఆయనను కలుసుకున్నారు. ధర్మపురిలో మురుగునీటి పరిష్కారానికి సీనరేజ్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని, నేరెల్లలో కేంద్రం ప్రకటించిన జవహర్ నవోదయ పాఠశాల స్థాపనకు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరారు.
డీపీవోగా హరికిషన్
జగిత్యాల: జిల్లా పంచాయతీ అధికారిగా హరికిషన్‌ను నియమిస్తూ ప్రభుత్వ సెక్రెటరి లోకేశ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. హరికిషన్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉండగా.. జగిత్యాలకు నియమించారు.
‘ప్రాక్టికల్స్’లో సీసీ కెమెరాలు తప్పనిసరి
జగిత్యాల: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులకు వసతులు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ గౌతమ్‌రెడ్డి అన్నారు. ఇంటర్మీడియెట్ అధికారులతో బుధవారం సమావేశమయ్యారు. పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ ఉండేలా చూడాలన్నారు. వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. సకాలంలో కేంద్రాలకు చేరేలా బస్సులు నడపాలని డిపో మేనేజర్లకు సూచించారు. ఇంటర్ నోడల్ అధికారి నారాయణ, డీఈవో రాము, ఫైర్ ఆఫీసర్ పాల్గొన్నారు.
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
జగిత్యాల: జిల్లాలో బాలబాలికల లింగ నిష్పత్తి సమానత్వం సాధించేలా కృషి చేయాలని అ దనపు కలెక్టర్ లత అన్నారు. బుధవారం బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాల్లో భా గంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో మహిళలు, పిల్లలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలికలు అన్ని రంగా ల్లో రాణించాలన్నారు. మహిళలు చట్టాలపై అవగాహన, హక్కులు తెలుసుకోవాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. వివిధ రంగాల్లో రాణించిన బాలికలు, మహిళలను సన్మానించారు. మొక్కలు నాటారు. జిల్లా సంక్షేమాధికారి నరేశ్, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమాధికారి రాజ్‌కుమార్, డీఈవో రాము పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించాలి
జగిత్యాలక్రైం: వేసవిలో నాణ్యమైన విద్యుత్ అందేలా చూడాలని జిల్లా సర్కిల్ నోడల్ అధికారి తిరుమల్‌రావు అన్నారు. బుధవారం విద్యుత్‌శాఖ అధికారులతో టీపీడీఈఏ భవన్‌లో సమీక్షించారు. వేసవికాలానికి సంబంధించి కార్యాచరణ చేపట్టాలన్నారు. జిల్లా పరిధిలో 13/33 కేవీ ఇంటర్లింకింగ్ పనులు 8 పూర్తయ్యాయని, మిగతావి ఫిబ్రవరి 10లోపు పూర్తి చేయాలని సూచించారు. అధిక లోడున్న 315 ట్రాన్స్‌ఫార్లకు 201 పూర్తయ్యాయన్నారు. జగి త్యాలలో రెండు అదనపు 130 కేవీ పనులు పూ ర్తయ్యాయన్నారు. వినియోగదారులకు నిరంతర సర్వీస్ చేసేలా ప్రతి ఉద్యోగి స్థానికంగా ఉండాలన్నారు. 24/7 నిరంతర విద్యుత్ సేవలకు 1912 టోల్‌ఫ్రీ నంబరుకు డయల్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఈ ఐపీసీ రాక్, ఎస్‌ఈ సాల్యనాయక్, డీఈలు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment