ఆకలేస్తోంది
మాది రాయికల్ మండలం అయోధ్య గ్రామం. బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నాం. ఉదయం, సాయంత్రం సమయంలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. మేం కూడా చదువుకుంటున్నాం. సాయంత్రం వేళ ఆకలి అవుతోంది. ఇంటికి చేరేసరికి రాత్రి అవుతోంది. పొద్దున వెళ్లిన మేము రాత్రి ఇంటికి చేరుకుంటున్నాం. వచ్చేసరికి నీరసించి పోతున్నాం.
– మేఘన, అయోధ్య
దాతలు సహకరించాలి
పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం కోసం విద్యాశాఖ నుంచి ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. నిధులు మంజూరు కాగానే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేస్తాం. ఉదయం జావా అందిస్తున్నాం. ఆయా గ్రామాల్లోని దాతలు కూడా ముందుకు రావాలి. అందరూ సహకరించి పదో తరగతి విద్యార్థుల కోసం అల్పాహారం ఏర్పాటు చేసుకోవాలి.
– రాము, డీఈవో
Comments
Please login to add a commentAdd a comment