ఆరు గ్యారంటీలతో ప్రభుత్వం మోసం
● కవిత చొరవతోనే రాయికల్ అభివృద్ధి ● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
రాయికల్: సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఆరు పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చి ఏడాది అయినప్పటికీ వాటి ఊసే లేదని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోపు పథకాలు అమలు చేస్తామన్న సీఎం రేవంత్‌రెడ్డి హామీలు నెరవేర్చలేదని, జనవరి 26కి రైతు భరోసా ఇస్తామని రైతులను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని చెబుతున్నా.. ఎక్కడ అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హయాంలోనే రాయికల్ బల్దియాకు నిధులు మంజూరయ్యాయని, ఆ నిధుల ద్వారానే దేవాలయాలు, సీసీరోడ్లు, మున్సిపల్ భవనం వంటి పనులు చేపట్టారని గుర్తుచేశారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్‌యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు ఎనగందుల ఉదయశ్రీ, మారంపల్లి రాణి, మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్‌రెడ్డి, శ్రీరాముల సువర్ణ, నాయకులు బాబా, నేరటి శ్రీనివాస్, దొంతి నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment