బేటీ బచావో బేటీ పడావో విజయవంతం చేయాలి
జగిత్యాల: బేటీ బచావో బేటీ పడావో దశాబ్ది ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మహిళాశిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షించారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని ప్రారంభించి పదేళ్లు అవుతున్న సందర్భంగా మార్చి 8 వరకు ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సైకిల్ ర్యాలీ, బాలికల బైక్ ర్యాలీ, ప్రభాత్భేరి, మొక్కలు నాటే కార్యక్రమం తదితర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా సంక్షేమాధికారి నరేశ్, వైద్యాధికారి ప్రమోద్, ఇంటర్మీడియెట్ అధికారి నారాయణ, ఎస్సీ అభివృద్ధి అధి కారి రాజ్‌కుమార్, ఉపాధి కల్పన అధికారి సత్తమ్మ, చిత్రు, రాము తదితరులు పాల్గొన్నారు.
స్కానింగ్ సెంటర్లలో నిబంధనలు పాటించాలి
జగిత్యాల: స్కానింగ్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది నిబంధనలు పాటించాలని, ఫాం–ఎఫ్ ఆన్లైన్ పోర్టల్‌లో వచ్చేనెల ఐదో తేదీలోపు జిల్లా కార్యాలయంలో సమర్పించాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ అన్నారు. మంగళవారం వైద్య కార్యాలయంలో జిల్లాస్థాయి మల్టీమెంబర్ అప్రోపరియట్ అథారిటీ కమిటీతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాలో 78 స్కానింగ్ సెంటర్లు అనుమతి పొందాయని, ప్రతి సెంటర్‌పై నిఘా ఉంచాలని సూచించారు. ఆయన వెంట డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ జైపాల్‌రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్, గైనకాలజిస్ట్ విశ్వభారతి, పూర్ణచందర్, రామకృష్ణ, మంచాల కృష్ణ పాల్గొన్నారు.
మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేత
జగిత్యాల: ఈనెల 30 నుంచి వచ్చేనెల మూడో తేదీ వరకు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు గ్రిడ్ డివిజన్ ఇంజినీర్ శేఖర్‌రెడ్డి తెలిపారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల్లో మిషన్ భగీరథ పైపుల మరమ్మతు సందర్భంగా నీటి సరఫరా ఉండదన్నారు. ధర్మపురి, వెల్గటూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మల్లాపూర్ మండలాలను మినహాయించి మిగతా మండలాల్లో సరఫరా ఉండబోదని, ప్రజలు సహకరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment