త్యాగధనుల ఫలితమే గణతంత్రం
జగిత్యాలక్రైం: ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ అశోక్‌కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో త్యాగధనుల ఫలితమే గణతంత్ర దినోత్సవమని, వారిని స్మరించుకోవాలని అన్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. అదనపు ఎస్పీ భీంరావు, డీఎస్పీలు రంగారెడ్డి, సీఐలు అరిఫ్ అలీఖా న్, రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ కిరణ్‌కుమార్, రామకృష్ణ, వేణు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ అధికారి రవి ప్రసాద్, పంచాయతీరాజ్ కార్యాలయంలో డీపీవో మదన్మోహన్, ఎకై ్సజ్ కార్యాలయంలో సీఐ సర్వేశ్, రవాణాశాఖ కార్యాలయంలో డీటీవో శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సీఐ వేణుగోపాల్, రూరల్‌లో సీఐ కృష్ణారెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment