ప్రజావాణికి 43 దరఖాస్తులు
జగిత్యాల: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. వారి నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులకు ప్రాధాన్యత ఇచ్చి పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో పెట్టొద్దని తెలిపారు. వివిధ సమస్యలపై 43 ఫిర్యాదులు వచ్చాయి. అదనపు కలెక్టర్ లత, గౌతమ్‌రెడ్డి, ఆర్డీవోలు మధుసూదన్, జివాకర్‌రెడ్డి, కలెక్టర్ ఏవో హన్మంతరెడ్డి పాల్గొన్నారు.
జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ సత్యప్రసాద్
వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment