బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి

Published Tue, Jan 28 2025 12:15 AM | Last Updated on Tue, Jan 28 2025 12:15 AM

బాధ్య

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి

జగిత్యాల/కోరుట్ల/మెట్‌పల్లి/ధర్మపురి/రాయికల్‌: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు జగిత్యాల, రాయికల్‌, మెట్‌పల్లి, కోరుట్ల, ధర్మపురి స్పెషల్‌ ఆఫీసర్‌గా జిల్లా అదనపు కలెక్టర్‌ గౌతమ్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్‌ పాలకవర్గం పదవీకాలం ముగియడంతో స్పెషల్‌ ఆఫీసర్‌గా అడిషనల్‌ కలెక్టర్‌ను నియమించిన విషయం తెల్సిందే. గౌతంరెడ్డికి అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు శుభాకాంక్షలు తెలిపారు.

మెట్‌పల్లి: మున్సిపల్‌ స్పెషల్‌ ఆఫీసర్‌గా అడిషనల్‌ కలెక్టర్‌ గౌతంరెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. స్థానికంగా నెలకొన్న సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.

పెన్షన్లు ఇవ్వాలని ధర్నా

జగిత్యాల: పెన్షన్లు రాక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే మంజూరు చేయాలని సారంగాపూర్‌ మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన బీడీ కార్మికులు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేపట్టారు. సుమారు 60 మంది మహిళలు తరలివచ్చి ఆందోళనకు దిగారు.

జాతీయ క్రీడలకు టెక్నికల్‌ అఫిషియల్‌గా నవీన్‌కుమార్‌

కథలాపూర్‌: ఉత్తరాఖండ్‌లో నిర్వహించే 38వ జాతీయ ఖోఖో క్రీడలకు టెక్నికల్‌ అఫిషియల్‌గా మండలంలోని భూషణరావుపేట జెడ్పీ హైస్కూల్‌ పీడీ వాసం నవీన్‌కుమార్‌ ఎంపికై నట్లు హెచ్‌ఎం రాజయ్య తెలిపారు. ఈనెల 28 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు జరిగే జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో నవీన్‌కుమార్‌ పాల్గొననున్నారు. ఆయనను ఉపాధ్యాయులు అభినందించారు.

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్‌ పోటీలకు గోవిందారం విద్యార్థులు

మేడిపల్లి: భీమారం మండలం గోవిందారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు నాగమణి, జశ్వంత్‌, విగ్నేశ్‌ ఇటీవల పెద్దపల్లి జిల్లాలో జరిగిన జిల్లాస్థాయి పోటీలలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎస్జీఎఫ్‌ జిల్లా సెక్రటరీ లక్ష్మిరామ్‌ నాయక్‌ తెలిపారు. వీరు మెదక్‌ జిల్లాలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్‌ తెలిపారు. విద్యార్థులను హెచ్‌ఎం ఆష్పాక్‌ హుస్సేన్‌, ఉపాధ్యాయ బృందం అభినందించింది.

రూ.10 వేల వేతనం ఇవ్వండి

జగిత్యాల: తమకు రూ.10 వేల వేతనం ఇప్పించాలని మధ్యాహ్న భోజన కార్మికులు కోరారు. అలాగే ప్రతి విద్యార్థికీ మెనూ చార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో డీఈవోకు వినతిపత్రం అందించారు. మార్కెట్‌లో కోడిగుడ్డు ధర రూ.8 ఉంటే ప్రభుత్వం రూ.5 చెల్లిస్తోందని, ఒక్కో కోడిగుడ్డుకు రూ.3 నష్టపోతున్నామని పేర్కొన్నారు. మార్కెట్‌కు అనుగుణంగా ధరలు పెంచాలని కోరారు. అలాగే 9 నెలలుగా పెండింగ్‌లో ఉన్న కోడిగుడ్డు బిల్లులు చెల్లించాలన్నారు. మధ్యాహ్న భోజన వర్కర్స్‌ జిల్లా అధ్యక్షురాలు సంగం పద్మ, కార్యదర్శి శారద, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు, హన్మంతు, వెన్న మహేశ్‌, శారద, లక్ష్మీ, మల్లీశ్వరి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి
1
1/4

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి
2
2/4

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి
3
3/4

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి
4
4/4

బాధ్యతలు స్వీకరించిన ప్రత్యేకాధికారి గౌతంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement