అందుబాటులోకి గోదాములు | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి గోదాములు

Published Tue, Jan 28 2025 12:15 AM | Last Updated on Tue, Jan 28 2025 12:15 AM

అందుబ

అందుబాటులోకి గోదాములు

● పెరుగుతున్న నిల్వ సామర్థ్యం ● జిల్లావ్యాప్తంగా 37 గోదాముల నిర్మాణం ● 82,050 టన్నుల సరుకు నిల్వ చేసుకునే అవకాశం ● అద్దె చెల్లించడంలో ప్రభుత్వం తాత్సారం

జగిత్యాలఅగ్రికల్చర్‌: ఒకప్పుడు ధాన్యం నిల్వ చేసుకోవాలన్నా.. రసాయన ఎరువులు భద్రపర్చుకోవాలన్నా.. ఇటు రైతులు, అటు వ్యాపారులు అనే క ఇబ్బందులు ఎదుర్కోనేవారు. పొరుగున్న ఉన్న పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లోని గోదాముల్లో ధా న్యం, ఎరువులను నిల్వ చేసుకోవాల్సి వచ్చేది. జి ల్లాకు అవసరమైనప్పుడు తీసుకొచ్చేవారు. ఫలితంగా రవాణా భారం తడిసి మోపెడయ్యేది. ప్రస్తుతం జిల్లాలో గోదాములు నిర్మించడంతో ఇక్కడే రేషన్‌ బియ్యం, ఎరువులను నిల్వ చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు రైల్వే సౌకర్యం ఉండడంతో గోదాముల్లో నిల్వ చేసిన బియ్యాన్ని అవసరమైనప్పుడల్లా తమిళనాడు వంటి రాష్ట్రాలకు పంపిస్తున్నారు.

జిల్లాలో 37 గోదాములు

జిల్లాలో 37 గోదాములు ఉన్నాయి. వాటిలో 82,050టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. వీటిని మార్కెట్‌ కమిటీ, నాబార్డు నిధులతో నిర్మించారు. జగిత్యాలలో ఏడు గోదాముల్లో 17 వేల టన్నులు, మెట్‌పల్లిలోని ఏడు గోదాముల్లో 15,350, ధర్మపురిలోని ఆరింట్లో 14,500, మల్యాలలోని నాలుగింట్లో 12వేలు, మల్లాపూర్‌లోని ఒక గోదాములో 5వేలు, ఇబ్రహీంపట్నంలోని రెండు గోదాముల్లో 3,100, పెడపల్లిలోని ఒక గోదాములో 2500, వెల్గటూర్‌లోని గోదాములో 5వేలు, రాయికల్‌లోని గోదాములో 2500, కోరుట్లలోని నాలుగింట్లో 2100, గొల్లపల్లిలోని నాలుగింట్లో 3వేల టన్నుల చొప్పున నిల్వ సామర్థ్యం ఉంది. ఇంకా కథలాపూర్‌, మేడిపల్లి మండలాలతో పాటు కొత్త మండలాల్లో గోదాములు నిర్మించాల్సిన అవసరం ఉంది.

అద్దెకు సివిల్‌ సప్‌లై.. మార్క్‌పెడ్‌ సంస్థలకు

మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గోతాములను ఎక్కువగా సివిల్‌ సప్‌లై, మార్కెఫెడ్‌ సంస్థలు అద్దెకు తీసుకుంటున్నాయి. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి.. రైస్‌ మిల్లుల్లో మర ఆడించి.. వచ్చిన బియ్యాన్ని సివిల్‌ సప్‌లై సంస్థ ఈ గోదాముల్లో నిల్వ చేస్తున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులను నిల్వ చేసేందుకు మార్క్‌ఫెడ్‌ సంస్థ వీటిని లీజుకు తీసుకుంటోంది. రైతుల నుంచి పంటలు కొనుగోలు చేసిన వ్యాపారులు ధరలు లేనప్పుడు నిల్వ చేసేందుకు కూడా ఈ గోదాములను లీజుకు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 73,800 టన్నుల నిల్వ సామర్థ్యం ఉన్న 26 గోదాంలను ప్రభుత్వ రంగ సంస్థ సివిల్‌ సప్‌లై, మార్క్‌ఫెడ్‌ అద్దెకు తీసుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అద్దెకు తీసుకున్న సంస్థలు, ఆయా మార్కెట్‌ల పరిధిలో ఉన్న గోదాములకు ఏడాది ప్రతిపాదికన అద్దె చెల్లిస్తుంటాయి. సివిల్‌ సప్‌లై వంటి సంస్థలు అద్దె చెల్లించడంతో కొంత ఆలస్యం చేస్తుండటంతో మార్కెట్‌ అధికారులు లేఖలు రాస్తున్నారు.

అప్పులతో నిర్మాణం

మార్కెటింగ్‌ శాఖ చాలాచోట్ల నిర్మించిన గోదాములను రైతులు నేరుగా వినియోగించుకోవడం లేదు. మార్కెట్‌లో ధర లేనప్పుడు రైతులు ఇందులో నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా.. భద్రత ఉండదనే ఉద్దేశంతో ముందుకు రావడం లేదు. అద్దె ప్రాతిపదకన నడుస్తుండడంతో గోదాములు కొన్నిసార్లు నెలల తరబడి ఖాళీగా ఉంటున్నాయి. జగిత్యాల వంటి చాలాచోట్ల గోదాములను ఇతర మార్కెట్ల నుంచి అప్పు తెచ్చి నిర్మించడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. గోదాములను ప్రభుత్వం నిర్మించడంతో అద్దె చెల్లించడంలో జాప్యం చేస్తోంది. ఫలితంగా మార్కెట్‌ కమిటీలు ఇబ్బంది పడుతున్నాయి.

గోదాములను అద్దెకిస్తున్నాం

జిల్లాలోని అన్ని గోములను ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలకు అద్దెకు ఇస్తున్నాం. ప్రస్తుతం 7,850 టన్నుల సామర్థ్యం గల 10 గోదాంలు ఖాళీగా ఉన్నాయి. కథలాపూర్‌, మేడిపల్లిలో గోదాములు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం.

– ప్రకాశ్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment
అందుబాటులోకి గోదాములు1
1/1

అందుబాటులోకి గోదాములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement