కొండగట్టులో సీతమ్మ కన్నీటి గుంటలకు గుర్తింపు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంపై ఉన్న సీతమ్మ కన్నీటి (ధార) గుంటలకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయినా ఏ అధికారి కూడా పట్టించు కోలేదు. అంజన్న దర్శనానికి వచ్చే భక్తులు ఈ సీతమ్మ కన్నీటి గుంటల నుంచి పక్క నుంచే వెళ్తున్నా.. అవి సీతమ్మ గుంటలని తెలియని పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ‘సీతమ్మ కన్నీటి గుంటలపై నిర్లక్ష్యం..’ శీర్షికన గత నెల రెండో తేదీన శ్రీసాక్షిశ్రీ కథనం ప్రచురించింది. ఆ కథనానికి స్పందించిన అప్పటి ఈవో రామకృష్ణారావు స్పందించి దాతల నుంచి సహాయం కోరారు. వచ్చిన సొమ్ముతో ప్రస్తుతం సీతమ్మ గుంటల చుట్టూ జాలీలతో వలయం ఏర్పాటు చేశారు. అక్కడ సూచిక ఏర్పాటు చేసి భక్తులు మొక్కుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశారు.
నేడు
Comments
Please login to add a commentAdd a comment