చర్యలు తీసుకుంటాం
నేను ఇటీవలే ఆలయ ఈవోగా బాధ్యతలు తీసుకున్నా. ఫోన్ల కౌంటర్ కోసం టెండర్ ఎందుకు నిర్వహించలేదో తెలుసుకుంటా. ఆలయంలోకి ఫోన్లు తీసుకెళ్లకుండా చర్యలు చేపడుతాం.
– కృష్ణప్రసాద్, ఈవో, కొండగట్టు
కౌంటర్ ఏర్పాటు చేయాలి
భక్తులు ఆలయంలోకి ఫోన్లు తీసుకెళ్లకుండా అధికారులు సిబ్బందిని నియమించి ఫోన్లు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలి. నిబంధన ఉల్లంఘించిన వారిపై జరిమానా విధించాలి లేదా గతంలో వలె టెండర్ నిర్వహించాలి.
– కొండ మారుతి, భక్తుడు
నిషేధం చేపట్టండి
సామాన్య భక్తులకు ఒక రూల్, వీఐపీలకు ఒక రూల్ ఉండొద్దు. హోంగార్డులు, సెక్యూరిటీ గార్డులు, అధికారులు ఉన్నా ఫోన్లు లోపలికి ఎలా వెళ్తున్నాయి. స్వామివారి మూలవిరాట్ను ఫొటోలు తీయడం ఎక్కువైంది. ఇప్పటికై నా ఆలయ అధికారులు పకడ్బందీగా సెల్ఫోన్ నిషేధం చేపట్టాలి.
– గడ్డం నడిపి మల్లేశం, భక్తుడు, గొల్లపల్లి
ఫొటోలు తీయడం సరికాదు
గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ను భక్తులు, ఇంకా ఎవరైన సరే స్వయంగా వచ్చి దర్శించుకోవాలి. దీంతో స్వామివారు ఆశీస్సులు ఎల్ల వేళలా ఉంటాయి. ఫోన్లలో ఫొటోలో తీయడం సరికాదు.
– కపిందర్ స్వామి, స్థానాచార్యులు, కొండగట్టు
Comments
Please login to add a commentAdd a comment