‘కళాసిల్క్‌’ మేళాకు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

‘కళాసిల్క్‌’ మేళాకు ఆదరణ

Published Fri, Jan 31 2025 2:09 AM | Last Updated on Fri, Jan 31 2025 2:09 AM

‘కళాసిల్క్‌’ మేళాకు ఆదరణ

‘కళాసిల్క్‌’ మేళాకు ఆదరణ

విద్యానగర్‌(కరీంనగర్‌): కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్‌ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైన్‌, పోచంపల్లి చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, చుడీదార్స్‌, సూటింగ్స్‌ షర్టింగ్స్‌, జువెల్లరీ, బెడ్‌ షీట్స్‌ అన్నివర్గాల వారికి అందుబాటు ధరల్లో ఉన్నాయని మేనేజర్‌ బిజుముండల్‌ పేర్కొన్నారు. ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి ప్రఖ్యాతి పొందిన చీరలతోపాటు హరియానా బెడ్‌ కవర్లు, కుషన్‌ కవర్లు, లక్నో కుర్తీస్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, డోర్‌ కర్టన్స్‌, స్టోన్‌ జువెల్లరీ, పెరల్స్‌, బంజారా, కోల్‌కతా బ్యాగులు, ఒడిశా పేయింటింగ్స్‌, మధ్యప్రదేశ్‌ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్‌ కోటా బాందేజన్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, ఉత్తరప్రదేశ్‌ జామ్లాని, చేనేత హస్తకళ వస్తువులు కూడ ఉన్నట్లు తెలిపారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement