విద్యారంగంపై ప్రభుత్వాల నిర్లక్ష్యం
కరీంనగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకట్ మండిపడ్డారు. గురువారం వాగేశ్వరి డిగ్రీ కాలేజీలో జిల్లా అధ్యక్షుడు రత్నం రమేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడా రు. కేంద్ర ప్రభుత్వం నూతన జాతీ య విద్యా విధానం పేరుతో కాషా యికరణ చేసే పరిస్థితిలో ఉందన్నా రు. విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యత అని చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి హామీ లను తుంగలో తొక్కారని మండిపడ్డారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి కేటాయించి స్కాలర్షిప్ బకా యిలు విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు కె.విశ్వనాథ్, దాముఖ లచ్చన్నతదితరులు పాల్గొన్నారు. అనంతరం పీడీఎస్యూ జిల్లా కార్యవర్గాన్ని 13 మందితో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment