బీడీ పరిశ్రమపై జీఎస్టీ రద్దు చేయాలి
● దేశవ్యాప్తంగా ఒకేరకమైన వేతనం ఇవ్వాలని ● రాష్ట్ర మహాసభల్లో వక్తలు
కోరుట్ల: బీడీ పరిశ్రమపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రద్దు చేయాలని బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు సూచించారు. ఫెడరేషన్ రెండో మహాసభలు గురువారం కోరుట్లలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీడీ కార్మికులకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలన్నారు. బీడీ పరిశ్రమకు బడ్జెట్ కేటాయించని ప్రభుత్వం.. జీఎస్టీ ఎలా పెంచుతుందని ప్రశ్నించారు. కార్మికులకు రూ.వెయ్యి నుంచి రూ.500లోపే పింఛన్ ఉందన్నారు. బీడీ కార్మికులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇళ్లు కట్టించి ఇవ్వాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఎస్.బాలరాజు, సుతారి రాములు, కార్యదర్శులు ఎస్.విలాస్, సమ్మయ్య, ఎండీ.ముఖ్రం, గోవర్ధన్, రాములు, మౌలాన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment