![సాగు నీటి కోసం ఆందోళన వద్దు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/31/30dmp51-180042_mr-1738268892-0.jpg.webp?itok=-3zO8K7c)
సాగు నీటి కోసం ఆందోళన వద్దు
● ఎస్సారెస్పీ, కాళేశ్వరం లింక్–2 ద్వారా పంటలకు అందిస్తాం ● ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
పెగడపల్లి: సాగునీటి విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, చివరి ఆయకట్టుకు ఎస్సారెస్పీ, కాళేశ్వరం లింక్–2 ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. సాగునీటికి పడుతున్న ఇబ్బందులను మండలంలోని నందగిరి రైతులు ఇటీవల ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండు రోజుల క్రితం గంగాధర మండలం బూర్గుపల్లి వద్దగల వరదకాల్వ ద్వారా నందగిరి కుమ్మరికుంట, ఊర చెరువులకు నీటిని విడుదల చేయించారు. గురువారం కాళేశ్వరం లింక్–2, వరదకాల్వను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. కుమ్మరికుంట, ఊర చెరువు నింపేందుకు తూము నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టుకు సాగునీరందేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాములుగౌడ్, విండో చైర్మన్ భాస్కర్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, లక్ష్మీనా రాయణ, మల్లేశం, సత్యనారాయణరెడ్డి, రవి, సురే శ్, అశోక్‌రెడ్డి, గంగాధర్, మల్లారెడ్డిపాల్గొన్నారు.
అక్రమ ఇళ్ల నిర్మాణదారులకు నోటీసులు
గొల్లపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని మీడియాలో కథనాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. గురువారం కబ్జా స్థలాలు పరిశీలించిన రెవెన్యూ, పంచాయతీ అధికారులు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న వారికి నోటీసులు జారీచేశారు. తహసీల్దార్ వరందన్ మాట్లాడుతూ.. చర్యల నిమిత్తం ఆర్డీవోకు నివేదిక అందించినట్లు తెలిపారు. 735, 544 సర్వే నంబర్లలో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న 15 మందికి నోటీసులు జారీ చేసినట్లు పంచాయతీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment