![జాతీయ రహదారిని విస్తరించండి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06krt07-180033_mr-1738871044-0.jpg.webp?itok=zDCSt4SO)
జాతీయ రహదారిని విస్తరించండి
● కేంద్ర మంత్రికి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ వినతి
కోరుట్ల:సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు నిర్మించే జాతీయ రహదారి 368ని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని మాజీమంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేంద్ర రోడ్లు, భవనాల మంత్రి నితిన్ గడ్కరీకి వినతిపత్రం అందించారు. కేటీఆర్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన ఎమ్మెల్యే కేంద్రమంత్రి గడ్కరీని కలిశారు. జాతీయ రహదారి విస్తరణతో రహదారి వెంబడి ఉన్న వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలు మరింత అనుసంధానమై అభివృద్ధి చెందుతాయని, జాతీయ రహదారి నంబర్ 63 కూడా కలుస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు.
యాసంగి పంటలపై సమీక్ష
జగిత్యాల: ప్రస్తుతం సాగు చేస్తున్న యాసంగి పంటలు, గతేడాది వానాకాలం, యాసంగికి సంబంధించిన సీఎంఆర్ చెల్లింపులపై రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ జిల్లా అధికారులతో గురువారం వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. కొత్త రేషన్‌కార్డులు, కార్డుల్లో పేర్లు చేర్చడం వంటి వాటిపై పలు సూచనలు చేశారు. వానాకాలం ధాన్యం దిగుమతి చేసుకున్న మిల్లర్లు 10 శాతం బ్యాంక్ గ్యారంటీని సత్వరమే సమర్పించేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment