![నేటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06cpd201-180030_mr-1738871043-0.jpg.webp?itok=bgLdoN7a)
నేటి నుంచి శ్రీలక్ష్మీనృసింహస్వామి జాతర
సారంగాపూర్/మల్యాల: బీర్‌పూర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం సాయంత్రం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీర్‌పూర్‌కు రెండు కిలోమీటర్ల దూరంలో.. కొండపై వెలసిన స్వామివారికి ఈనెల 7న ఊరేగింపుసేవ, 8న అంకురార్పణ, ధ్వజారోహణం, 9న స్వామివారి కల్యాణం, 10న అగ్నిప్రతిష్టాపన, బలిహరణం, 11న వసంతోత్సవం, 12న చందనోత్సవం, డోలోత్సవం, తెప్పొత్సవం, 13న పార్వేట్ ఉత్సవం, 14న వనమహోత్సవం, 15న ప్రత్యేక పూజలు, 16న వేదసదస్సు, 17న డోపుకథ, రథోత్సవం, 18న ఏకాంతోత్సవం, 19న ఏకాదశ కలశస్నపన తిరుమంజనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగునీరు, నీడ, వైద్యసౌకర్యం, రవాణా, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు వొద్ధిపర్తి పెద్ద సంతోష్ తెలిపారు.
ఈనెల 9 నుంచి నల్లగుట్ట
లక్ష్మీనర్సింహస్వామి ఉత్సవాలు
మల్యాల మండలం మానాలలోని నల్లగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయం జాతర ఉత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 9 నుంచి 12 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. 9న స్వామివారి కల్యాణం, అన్నదానం, 10న ఫలపంచామృతాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణం, 11న పుష్పార్చన, నృసింహ శతక సహస్రనామ పారాయణం, 12న రథోత్సవం ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.
![నేటి నుంచి శ్రీలక్ష్మీనృసింహస్వామి జాతర1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06jgl102-180028_mr-1738871043-1.jpg)
నేటి నుంచి శ్రీలక్ష్మీనృసింహస్వామి జాతర
Comments
Please login to add a commentAdd a comment