ఖైదీలకు వసతులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలకు వసతులు కల్పించాలి

Published Fri, Feb 7 2025 1:27 AM | Last Updated on Fri, Feb 7 2025 1:27 AM

ఖైదీల

ఖైదీలకు వసతులు కల్పించాలి

జగిత్యాలజోన్‌: జైలులో ఖైదీలకు వసతులు కల్పించాలని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి కంచ ప్రసాద్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని స్పెషల్‌ సబ్‌ జైలును గురువారం సందర్శించారు. ఖైదీల్లో మంచి పరివర్తన తెచ్చేందుకు జైలు అధికారులు కృషి చేయాలన్నారు. నేరాలు చేసి జైలుకు రావడం ద్వారా కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయని, జైలు జీవితం ఓ గుణపాఠంలాగా మార్చుకుని తిరిగి తప్పులు చేయకుండా ఉండాలని ఖైదీలకు సూచించారు. ఆయన వెంట జిల్లా డిప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ పొట్టవత్తిని సతీశ్‌, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రాచకొండ విజయ్‌, జైలర్‌ మొగిలేశ్‌, హెడ్‌ వార్డర్‌ మజారోద్దిన్‌ పాల్గొన్నారు.

ప్రభుత్వ కళాశాలలో ఉత్తమ ఫలితాలు

జగిత్యాల: జిల్లాకేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాల అటానమస్‌ హోదా పొందిన అనంతరం మొదటిసారి నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ డిగ్రీ మొదటి సంవత్సరం సెమిస్టర్‌ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ తెలిపారు. గురువారం కళాశాలలో శాతావాహన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి రంగప్రసాద్‌ ఆధ్వర్యంలో ఫలితాలను విడుదల చేశారు. 242 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 147 మంది ఉత్తీర్ణత సాధించారని, ఫలితాలు కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అటానమస్‌ హోదాతో కళాశాల గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. కార్యక్రమంలో కో–ఆర్డినేటర్‌ రాంచంద్రం, చంద్రయ్య పాల్గొన్నారు.

డ్రోన్‌ సర్వేతో మాస్టర్‌ ప్లాన్‌

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలో డ్రోన్‌తో సర్వే చేసి మాస్టర్‌ ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నట్లు అడిషనల్‌ కలెక్టర్‌ గౌతంరెడ్డి అన్నారు. పట్టణంలోని మినీ స్టేడియంలో డ్రోన్‌ సర్వేను గురువారం ప్రారంభించారు. డ్రోన్‌ సర్వే అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. పట్టణంలో 50 సర్వే పాయింట్లను గుర్తించామని, ప్రజలు సర్వేకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌, మేనేజర్‌ వెంకటలక్ష్మీ, టీపీవో రాజేంద్రప్రసాద్‌, శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ రత్నాకర్‌, ముజీబ్‌, సర్వేయర్‌లు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పనులు పరిశీలన

కోరుట్లరూరల్‌: కోరుట్ల మండలం వెంకటాపూర్‌, సర్పరాజ్‌పూర్‌, అయిలాపూర్‌లో చేపడుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్‌డీఓ రఘువరన్‌ గురువారం పరిశీలించారు. నర్సరీలు, కంపోస్ట్‌ షెడ్లు, వైకుంఠదామాలను సందర్శించారు. వేసవి సమీపిస్తున్నందున మొక్కలకు నీళ్లు అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఈజీఎస్‌ ఏపీఓ మమత పాల్గొన్నారు.

దరఖాస్తులు ఆహ్వానం

జగిత్యాలటౌన్‌: ఎస్సెస్సీ, ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌ తదితర పోటీ పరీక్షల్లో నైపుణ్య అభివృద్ధికి కరీంనగర్‌ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత శిక్షణకు జిల్లాకు చెందిన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. ఈనెల 9లోపు http://tfbcrtudy circer. cgg.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామీణు లు రూ.1.50లక్షలు, పట్టణప్రాంతం వారు రూ.రెండు లక్షలలోపు వార్షికాదాయం ఉన్నవా రు అర్హులని పేర్కొన్నారు. చదువుకుంటున్నవారు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు అనర్హులని, వివరాలకు 0878–2268686 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఖైదీలకు వసతులు కల్పించాలి1
1/3

ఖైదీలకు వసతులు కల్పించాలి

ఖైదీలకు వసతులు కల్పించాలి2
2/3

ఖైదీలకు వసతులు కల్పించాలి

ఖైదీలకు వసతులు కల్పించాలి3
3/3

ఖైదీలకు వసతులు కల్పించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement