ఎమ్మెల్సీ ఎన్నికలకు 15 నామినేషన్లు
కరీంనగర్ అర్బన్: మెదక్–నిజామాబాద్–కరీంనగర్–ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం 15 నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 12 మంది, టీచర్స్ ఎమ్మెల్సీకి ముగ్గురు నామినేషన్లు దాఖ లు చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. పట్టభద్రుల స్థానానికి కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన యాదగిరి శేఖర్‌రావు తరఫున పచ్చునూరి సురేందర్, మంచి ర్యాల జిల్లా జన్నారం మండలం చింతగూడకు చెందిన మేకల అక్షయ్ కుమార్, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం గుండంపల్లికి చెందిన గుయ్య సాయికృష్ణమూర్తి, కరీంనగర్ నగరానికి చెందిన ఎడ్ల సాయి కృష్ణప్రియ నామినేషన్లు దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన దొడ్ల వెంకటేశం, మంచిర్యాల జిల్లా తిరుమలగిరి కాలనీకి చెందిన కొమిరెడ్డి మహేశ్, నిజామాబాద్‌కు చెందిన గడ్డం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కొసునూరుపల్లికి చెందిన వేముల విక్రమ్ రెడ్డి నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీస్థానానికి మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చెందిన మామిడి సుధాకర్‌రెడ్డి, సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన మల్కా కొమురయ్య, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం న్యూ మల్కాపూర్‌కు చెందిన వై.అశోక్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు.
గ్రాడ్యుయేట్ స్థానానికి 12
ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి 3 దాఖలు
Comments
Please login to add a commentAdd a comment