![నిజాం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/01krt76%282%29-180038_mr-1738871042-0.jpg.webp?itok=l-x1E5MS)
నిజాం షుగర్ ఫ్యాక్టరీ
ముందడుగు పడని
మల్లాపూర్: ఉమ్మడి జిల్లాలోనే వ్యవసాయ ఆధారిత పరిశ్రమగా ముద్రపడిన ముత్యంపేటలోని నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఇంకా ముందడుగు పడడం లేదు. అధికారంలోకి రాగానే షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ మేరకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో పునరుద్ధరణ కమిటీని నియమించింది. ఆ బృందం గతేడాది ఫ్యాక్టరీలను సందర్శించి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఫ్యాక్టరీ నడిచిన సమయంలో యాజమాన్యం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణం రూ.210కోట్లలో వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రూ.192 కోట్లు చెల్లించింది. ఫ్యాక్టరీని తెరిచి పాత పద్ధతిలోనే నడపాలని యాజమాన్యాన్ని కోరగా.. ప్రభుత్వం మారినప్పుడల్లా సమస్య వచ్చే అవకాశం ఉంటుందని నిరాకరించినట్లు తెలిసింది. ఈ క్రమంలో జా యింట్ వెంచర్‌లోనా..? ప్రభుత్వపరంగానా..? ప్రైవేటీకరణ చేయడమా..? అని ప్రభుత్వం, యాజమాన్యం మధ్య చర్చలు ఇంకా కొలిక్కిరావడం లేదు. ఫలితంగా ఫ్యాక్టరీల పునరుద్ధరణ మరింత జాప్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఫ్యాక్టరీ స్థితిగతులపై ఆధ్యయనం
ముత్యంపేటలోని ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం, యాజమాన్యం సంయుక్తంగా ఫార్చన్ కన్సల్టెంట్‌ను సంప్రదించాయి. ఫ్యాక్టరీ స్థితిగతులను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కోరాయి. దీంతో గత డిసెంబర్ 8న ఎన్‌డీసీఎల్ సీఈవో సుబ్బారాజుతో కలిసి కన్సల్టెంట్ ఇంజినీర్ల బృందం ఫ్యాక్టరీని సందర్శించి యంత్రాల పనితీరు, మరమ్మతు, పరిసరాలను రెండు రోజులపాటు పరిశీలించారు. ఫ్యాక్టరీలోని యంత్రాలేవీ పనికిరావని, మరమ్మతు చేయించినా రూ.30 నుంచి రూ.40కోట్లు అవుతుందని, అయినా 9శాతం రికవరీతో నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని తేల్చారు. యంత్రాలన్నీ తొలగించి కొత్తవి ఏర్పాటు చేసి ఫ్యాక్టరీని నడిపించేందుకు అవసరమైన నివేదికను ఈనెల 28లోగా ఇవ్వనున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించినట్లు ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఫ్యాక్టరీ తెరుచుకునే అవకాశం మాత్రం కనిపించడం లేదు. పాతయంత్రాలను మరమ్మతు చేసి నడపాలన్నా.. కొత్తవి అమర్చాలన్నా.. ఏడాది పట్టేలా ఉంది. అలాగే ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు అవసరమైన చెరుకు సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రైతులతో జూన్‌లోనే చెరుకు పంటసాగుకు సన్నద్ధం చేయించాల్సి ఉంటుంది. ఆ పంట కూడా వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్ వరకు సాగు పూర్తవుతుంది. ఫ్యాక్టరీలో క్రషింగ్‌కు యంత్రాలను సిద్ధం చేయాలన్నా.. చెరుకు పంట సాగు పూర్తవ్వాలన్న వచ్చే ఏడాదిలోనే జరిగే అవకాశం ఉండటంతో 2026 డిసెంబర్ వరకు ఫ్యాక్టరీ పునఃప్రారంభం కానుంది.
అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ హామీ
ఇంకా కొలిక్కిరాని ప్రభుత్వం, యాజమాన్యం మధ్య చర్చలు
ఫ్యాక్టరీ స్థితిగతుల అధ్యయనం ఫార్చన్ కన్సల్టెంట్‌కు అప్పగింత
మార్చి నెలాఖరులోగా వెలువడనున్న నిర్ణయం?
త్వరగా తెరిపించాలి
నిజాం చక్కెర కర్మాగారాలను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించాలి. లే ఆఫ్‌తో మూతపడిన ఫ్యాక్టరీలను తెరిపించాలని ఇప్పటికే అనేక ఉద్యమాలు చేశాం. పాదయాత్రలు చేసి పోరాడాం. ఫ్యాక్టరీని తెరిపిస్తారని చెరుకు రైతులందరం ఆశగా ఎదురుచూస్తున్నాం.
మామిడి నారాయణరెడ్డి, చెరుకు
ఉత్పత్తిదారుల సంఘం, అధ్యక్షుడు
![నిజాం షుగర్ ఫ్యాక్టరీ1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/01krt77-180038_mr-1738871042-1.jpg)
నిజాం షుగర్ ఫ్యాక్టరీ
Comments
Please login to add a commentAdd a comment