మాతాశిశు మరణాలు నివారించాలి | - | Sakshi
Sakshi News home page

మాతాశిశు మరణాలు నివారించాలి

Published Fri, Jan 31 2025 2:11 AM | Last Updated on Fri, Jan 31 2025 2:11 AM

మాతాశిశు మరణాలు నివారించాలి

మాతాశిశు మరణాలు నివారించాలి

జగిత్యాల: మాతాశిశు మరణాలను నివారించేలా వైద్యులు తల్లిదండ్రులకు తగిన సూచనలు ఇవ్వాలని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌ అన్నారు. గురువారం వైద్య కార్యాలయంలో చిన్నపిల్లల మరణాలపై సమీక్షించారు. గతేడాది ఏప్రిల్‌ 1నుంచి ఇప్పటి వరకు 104 మంది చిన్నపిల్లలు మరణించారని, వీటిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్క కేసును క్షుణ్ణంగా విచారించి పలు సూచనలు ఇచ్చారు. ఎక్కువగా ఫ్రీటర్మ్‌ బేబిస్‌, హార్ట్‌ డిసిజెస్‌, ఆస్పిరేషన్‌ కేసులున్నాయన్నారు. తల్లులు తమ పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత భుజం మీద వేసుకుని బర్ఫింగ్‌ చేయాలని, నెమ్మదిగా వెన్నుపై తట్టాలని, తేన్పులు వచ్చిన తర్వాతే పిల్లలను ప డుకోబెట్టాలని సూచించారు. పసిపిల్లలకు స్నా నం చేయించేటప్పుడు నోట్లోకి నీరు పోకుండా చూసుకోవాలన్నారు. ప్రతి ఆరోగ్య ఆశా కార్యకర్తలు డెలివరీ అయిన బాలింతలకు కౌన్సెలింగ్‌ ఇవ్వాలని, పిల్లలను ఎలా చూడాలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైల్డ్‌ డెత్‌ రివ్యూ సభ్యులు, ప్రోగ్రాం ఆఫీసర్‌ ఎ.శ్రీనివాస్‌, డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, జైపాల్‌రెడ్డి, సుమన్‌రావు, పూర్ణచందర్‌ పాల్గొన్నారు.

డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement