● 2 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలు
విద్యానగర్(కరీంనగర్)/జ్యోతినగర్(రామగుండం): మాఘమాసం గురువారం ప్రారంభమైంది. ఇక, పెళ్లి బాజాలు మోగనున్నాయి. గృహ ప్రవేశాలకు అన్నీ మంచి రోజులే. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 17 వరకు ముహూర్తాలుండగా.. వాటిలో ఫిబ్రవరి 16, మార్చి 16న ఎక్కువ పెళ్లిళ్లు జరుగుతాయని కరీంనగర్‌కు చెందిన మయూరగిరి పీఠాధిపతి, జ్యోతిష్య, వాస్తు పండితుడు నమిలికొండ రమణాచార్యులు, మల్కాపూర్‌కు చెందిన పురోహితుడు రుద్రభట్ల సత్యనారాయణ తెలిపారు. ఫిబ్రవరిలో 2, 3, 7, 13, 14, 15, 16, 21, 23, 25, మార్చిలో 2, 6, 7, 12, 14, 15, 16, 17 తేదీల్లో పెళ్లి ముహూర్తాలున్నాయని పేర్కొన్నారు. వివాహాలకు సిద్ధమవుతున్నవారు ఫంక్షన్‌హాళ్లు, డెకరేషన్, కేటరింగ్ బుకింగ్ తదితర పనుల్లో బిజీ అయ్యారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఫంక్షన్‌హాళ్ల నిర్వాహకులు వసతులను బట్టి రూ.40 వేల నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుంటున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో వస్త్ర, బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment