వరంగల్ జిల్లా: భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్న పోదెం వీరయ్య కుటుంబానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోదెం కృష్ణప్రసాద్ రాజకీయాల వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ఈ నెల 23న తన ప్ర భుత్వ ఉపాధ్యాయ(కన్నాయిగూడెం ఆశ్రమ ఉన్న త పాఠశాల స్కూల్ అసిస్టెంట్) పదవికి రాజీ నామా చేసి ప్రజా క్షేత్రంలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ముందుగా బీఆర్‌ఎస్ తరఫున టిక్కెట్ ఆశించినప్పటికీ అధికార పార్టీ నాగజ్యోతికి టికెట్ కేటాయించింది. అయితే అధికార పార్టీ తరఫున టికెట్ ఆశించిన పోదెం కృష్ణప్రసాద్ భంగపడ్డారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోదెం ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారడంతో ఎటు పోదాం అనే ఆలోచనలో ఉన్న పోదెం తన అనుచరులతో మూడు రోజులుగా చర్చిస్తున్నారు.
వారి అభిప్రాయాల మేరకు తన దారిని మళ్లించుకుని ఇతర పార్టీలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఎస్పీ వంటి పార్టీలు కృష్ణప్రసాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. సాధారణంగా పోదెంకు నియోజకవర్గవ్యాప్తంగా భారీగా మద్దతు దారులు ఉన్నా రు. ఇది ఇలా ఉండగా ఏ పార్టీలోకి చేరాలనే విషయంలో కృష్ణ ప్రసాద్ తర్జనభర్జన పడుతున్నారు. ఒక వేళ ఆయన ఏదైనా పార్టీ తరఫున పోటీ చేస్తే ములుగు నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదివాసీ ఓట్లతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయయ ఓట్లు భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది.
ఇదే కను క జరిగితే అధికార బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి నాగజ్యోతికి తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ హై కమాండ్ కృష్ణ ప్రసాద్‌ను బుజ్జగించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన అనుచరులు ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు బీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఉండాలని అందుకు సహకరించాలని కోరుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కృష్ణప్రసాద్ మాత్రం ఈసారీ ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంటానని భీష్మించుకుని కూర్చున్నారని ఆయన అనుచర వర్గాలు చెబుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరఫున ఆదివాసీ అభ్యర్థి ధనసరి అనసూయ, బీఆర్‌ఎస్ తరఫున మరో ఆదివాసీ అభ్యర్థి బడే నాగజ్యోతి పోటీలో ఉన్న తరుణంలో పోదెం కృష్ణ ప్రసాద్ అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలబడటానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలువడంతో ఈ విషయం నియోజక వర్గ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లంబాడ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి తనయుడు ఆజ్మీరా ప్రహ్లాద్ పోటీలో ఉంటానని ప్రకటించడం అదే సమయంలో ఆదివాసీ సామాజిక వర్గానికి పోదెం కృష్ణ ప్రసాద్ పోటీకి సిద్ధం కావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment