విద్యార్థుల్లో సామర్థ్యం పెంచాలి
రేగొండ: ప్రాథమిక పాఠశాల దశలోనే విద్యార్థుల్లో సామర్థ్యం పెంచడానికి ఉపాధ్యాయులు చొరవ చూపాలని డీఈఓ రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రూపిరెడ్డిపల్లి, దమ్మన్నపేట, రంగయ్యపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధన తీరు, మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులు రెగ్యులర్గా పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తెలుగుతో పాటు, ఆంగ్లంలో బోధన చేస్తూ విద్యార్థులు చదివేటట్లు చూడాలన్నారు. ఆయన వెంట అకాడమిక్ మానిటరింగ్ అధికారి లక్ష్మణ్, మండల విద్యాధికారి వేల్పుల ప్రభాకర్, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
జిల్లా విద్యాధికారి రాజేందర్
Comments
Please login to add a commentAdd a comment