వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి | Sakshi
Sakshi News home page

వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి

Published Wed, May 22 2024 8:40 AM

వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి

మల్దకల్‌: రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్‌ నాయక్‌ సూచించారు. మంగళవారం మల్దకల్‌ రైతువేదికలో వ్యవసాయ, జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రైతులతో నేరుగా మాట్లాడారు. పంటల సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. పంటలకు ఆశించే చీడపిడల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం ద్వారానే భూమి సారవంతంగా ఉంటుందన్నారు. తక్కువ పెట్టుబడులతో ఎక్కువ లాభాలు వచ్చే పంటలు సాగు చేసుకోవాలని పేర్కొన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు తప్పనిసరిగా రైతులు పాటించాలన్నారు. కార్యక్రమంలో ఏడీఎ సంగీతలక్ష్మి, ఏఓ రాజశేఖర్‌, ఏఈఓలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement