పిల్లల్ని కనడం ఒక ఎత్తు.. వారిని పెంచడం వంద ఎత్తులు | - | Sakshi
Sakshi News home page

పిల్లల్ని కనడం ఒక ఎత్తు.. వారిని పెంచడం వంద ఎత్తులు

Published Wed, Jan 29 2025 12:16 AM | Last Updated on Wed, Jan 29 2025 1:52 PM

-

సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ

రాజానగరం: పిల్లల్ని కనడం ఒక ఎత్తయితే వారిని పెంచడం వంద ఎత్తులని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ అన్నారు. మంగళవారం దివాన్‌ చెరువు వచ్చిన ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తమ కాలంలో ఉన్న అదృష్టం ఇప్పటి తరాలకు లేదన్నారు. తాను పదో తరగతిలోకి వచ్చే వరకూ రేడియో జోలికే వెళ్లలేదని.. నేడు ఆరు నెలల పిల్లాడి చేతిలో సెల్‌ఫోన్‌ పెట్టి తల్లి సీరియల్‌ చూసే రోజులు వచ్చాయని అన్నారు.

 ‘ఒక్కసారి తల వంచి నా వైపు చూడు.. ఇక జీవితంలో తలెత్తకుండా చేస్తాను’ అని సెల్‌ఫోన్‌ అంటే.. ‘కొన్ని పేజీలు చదువు.. ఎర్రకోట మీద ఎగిరే జాతీయ జెండాలా నీవెప్పుడూ తలెత్తుకుని జీవించేలా చేస్తాను’ అని పుస్తకం అంటుందని చెప్పారు. సెల్‌ఫోన్‌ చూడటం తప్పని చెప్పడం లేదని, ఎంతవరకూ వాడాలో అంతవరకే గానీ, వ్యసనంగా చేసుకోరాదని సూచించారు. 

ముఖ్యంగా యుక్త వయస్సులో ఉన్న అమ్మాయిల విషయంలో ఇది ఎంతో జాగరూకతతో వ్యవహరించవలసినదనే విషయాన్ని తల్లిదండ్రులు తెలుసుకోవాలన్నారు. సినిమాల్లోకి రాక ముందే సామాజిక అంశాలతో సుమారు రెండు వేల పాటలు రాశానని, చిత్ర పరిశ్రమలోకి వచ్చాక గడచిన 30 సంవత్సరాల్లో రెండు వేల సినిమాల్లో మూడు వేల పాటలు రాశానని అశోక్‌తేజ చెప్పారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement