రేపు సత్యదేవుని హుండీ లెక్కింపు
అన్నవరం: సత్యదేవుని సన్నిధిలో హుండీలను గురువారం తెరచి భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. ఈ నెల 30 నుంచి మాఘ మాసం ప్రారంభమవుతున్నందున రత్నగిరికి పెద్ద సంఖ్యలో భక్తులు రానున్నారు. ఈ నేపథ్యంలో గత నెల రోజులుగా భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించనున్నారు. హుండీ ఆదాయాన్ని చివరిగా గత నెల 30న లెక్కించారు. మళ్లీ నెల రోజుల తరువాత లెక్కిస్తున్నారు. సంక్రాంతి సెలవుల్లో సత్యదేవుని ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చినందున ఈసారి హుండీల ద్వారా సుమారు రూ.1.5 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హుండీల ఆదాయం లెక్కింపును దేవస్థానం చైన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు పర్యవేక్షించనున్నారు. ఈ లెక్కింపులో దేవస్థానం సిబ్బంది అందరూ పాల్గొనాలని ఈఓ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment