ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
కాకినాడ క్రైం: ఫోను లేదా నేరుగా వచ్చిన ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణమే స్పందించాలని ఎస్‌పీ బిందుమాధవ్ ఆదేశించారు. కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌వో) తమ ఫోన్ నంబర్లను బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించాలని సూచించారు. అన్ని వ్యాపార, విద్యా, వైద్య సంస్థలు, ప్రార్థన మందిరాలు, బహిరంగ స్థలాల్లో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కాకినాడ, పెద్దాపురం సబ్ డివిజన్లలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ఎస్‌పీ సమీక్షించారు. స్టేషన్ల వారీగా ఉన్న పెండింగ్ కేసుల వివరాలు సేకరించారు. మైనర్ల మిస్సింగ్ కేసులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. నేరస్తుల కదలికలపై నిఘా కొనసాగించాలన్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, దొంగతనాల కేసులను ఛేదించాలన్నారు. ప్రాపర్టీ రికవరీలపై దృష్టి సారించాలన్నారు. గంజాయి నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి, అమలు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ సూచనలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. సైబర్ నేరాల నియంత్రణకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎస్‌పీ సూచించారు. ఈ సమావేశంలో కాకినాడ, పెద్దాపురం సబ్ డివిజన్‌లకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.
హెల్మెట్ ధరించకే మరణాలు
హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీని ఎస్‌పీ బిందుమాధవ్ ప్రారంభించారు. ఎస్‌పీ కార్యాలయం వద్ద మొదలైన ఈ ర్యాలీ భానుగుడి జంక్షన్, మెయిన్ రోడ్డు, మసీద్ సెంటర్, బాలాజీ చెరువు సెంటర్, జెడ్పీ జంక్షన్, నూకాలమ్మ తల్లి గుడి మీదుగా, తిరిగి భానుగుడి కూడలి వద్ద ముగిసింది. ఈ సందర్భంగా ఎస్‌పీ మాట్లాడుతూ, హెల్మెట్ ధరించనందు వల్లనే రోడ్డు ప్రమాదాల్లో అధికంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ప్రతి ద్విచక్రవాహనదారూ హెల్మెట్ ధరించే వాహనం నడపాలని సూచించారు.
ఫ నేరస్తుల కదలికలపై
నిఘా కొనసాగించాలి
ఫ నేర సమీక్షలో ఎస్‌పి బిందుమాధవ్
Comments
Please login to add a commentAdd a comment