సహకార ప్రయోజనాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

సహకార ప్రయోజనాలపై అవగాహన

Published Thu, Jan 30 2025 2:31 AM | Last Updated on Thu, Jan 30 2025 2:31 AM

సహకార ప్రయోజనాలపై అవగాహన

సహకార ప్రయోజనాలపై అవగాహన

కాకినాడ సిటీ: సహకార సంఘాల వల్ల కలిగే ప్రయోజనాలపై సభ్యులకు అవగాహన కల్పించాలని జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం నిర్ణయించింది. బుధవారం కలెక్టరేట్‌లో జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా అధ్యక్షతన వ్యవసాయ అనుబంధ రంగాలు, జిల్లా సహకార బ్యాంక్‌, మార్కెటింగ్‌, పౌరసరఫరాలు, నాబార్డు తదితర శాఖల అధికారులతో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ భారత ప్రభుత్వం 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిందన్నారు. వివిధ అంశాల వారీగా సంవత్సరం మొత్తానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికపై సభ్యులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో కొత్తగా ప్రాథమిక వ్యవసాయ, మత్స్యకార, పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల ఏర్పాటు చేయడానికి గల అవకాశాలు పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో 72 ప్రాథమిక సహకార సంఘాలకు ఇప్పటి వరకు 65 ప్రాథమిక సంఘాల వివరాలు కంప్యూటరీకరణ పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలినచోట్ల పనులు వేగవంతం చేసి నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలని జేసీ అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీసీవో జి.వెంకటకృష్ణ, పశుసంవర్థక శాఖ జేడీ ఎస్‌.సూర్యప్రకాశరావు, మత్స్యశాఖ జేడీ కె. కరుణకర్‌, జిల్లా సహకార బ్యాంకు సీఈవో నరసింహారావు, నాబార్డు ఏజీఎం వై.సోమినాయుడు, డీఎస్‌వో లక్ష్మీప్రసన్న దేవి, మార్కెటింగ్‌ డీఈ వెంకటరాజారావు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement