మత్తు జోలికి వెళ్లొద్దు
విద్యార్థులకు ఎస్పీ హితవు
కాకినాడ క్రైం: మాదక ద్రవ్యాలకు బానిసలు కాకుండా భవితను బంగారు మయం చేసుకోవాలని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ విద్యార్థులకు హితవు పలికారు. బుధవారం కాకినాడలో ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో మమేకమాయ్యారు. మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాల్ని వివరించారు. యువత పెడదోవ పడితే కుటుంబంతో పాటు సమాజంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. సైబర్ నేరాలకు గురికావద్దని సూచించారు. అనుమానిత వెబ్ లింకులను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకు చిక్కొద్దని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment