ఐసీడీఎస్‌ పీడీగా విజయకుమారి | - | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌ పీడీగా విజయకుమారి

Published Wed, Jan 29 2025 12:16 AM | Last Updated on Wed, Jan 29 2025 12:16 AM

ఐసీడీఎస్‌ పీడీగా విజయకుమారి

ఐసీడీఎస్‌ పీడీగా విజయకుమారి

కాకినాడ సిటీ: జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ (ఐసీడీఎస్‌) పీడీగా కె.విజయకుమారి నియమితులయ్యారు. విజయనగరం జిల్లా సీడీపీవోగా పని చేస్తూ పదోన్నతిపై ఆమె ఇక్కడ పీడీగా నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆమె కలెక్టర్‌ షణ్మోహన్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకుని, పుష్పగుచ్ఛం అందించారు.

ఏలేరులో తగ్గిన నీటి నిల్వలు

ఏలేశ్వరం: వర్షాలు లేకపోవడం, ఎగువ నుంచి ప్రవాహం తగ్గుతూండటంతో ఏలేరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు స్వల్పంగా తగ్గాయి. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 86.56 మీటర్లు కాగా, మంగళవారం 82.47 మీటర్లుగా నమోదైంది. అలాగే, రిజర్వాయర్‌ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, నీటి నిల్వలు 16.57 టీఎంసీలకు పడిపోయాయి. ఆయకట్టుకు 1,100, విశాఖకు 200, తిమ్మరాజు చెరువుకు 100 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. పంపాకు నీటి విడుదల నిలిపివేశారు.

సూరంపాలెం

వీఆర్వో సస్పెన్షన్‌

గండేపల్లి: జనన ధ్రువీకరణ పత్రం జారీలో నిర్లక్ష్యం వహించిన సూరంపాలెం వీఆర్వో సరుగోలు సూర్యారావును సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ షణ్మోహన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గండేపల్లి తహసీల్దార్‌ ఆర్‌.శ్రీనివాస్‌ మంగళవారం ఈ విషయం తెలిపారు. సూరంపాలెం గ్రామానికి చెందిన అడ్డాల అనంతలక్ష్మి, లోవేశ్వరరావు దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. వీరికి జనన ధ్రువపత్రాల కోసం తల్లిదండ్రులు సుమారు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. వాటి మంజూరులో అలసత్వం వహించడంతో వీఆర్వో సూర్యారావును సస్పెండ్‌ చేస్తున్నట్టు మంగళవారం ఉత్తర్వులు వచ్చాయన్నారు.

శిశు మరణాలపై సమీక్ష

కాకినాడ క్రైం: నగరంలోని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌వో) కార్యాలయంలో శిశు మరణాలపై మంగళవారం సమీక్ష జరిగింది. డీఎంహెచ్‌వో డాక్టర్‌ నరసింహ నాయక్‌ ఆధ్వర్యాన డీఐవో సుబ్బరాజు ఈ సమీక్ష చేపట్టారు. శిశు మరణాలు చోటు చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మహిళ గర్భధారణ నుంచి ప్రసవించిన శిశువుకి ఏడాది వయసు వచ్చేంత వరకూ తగిన రీతిలో సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. సమావేశంలో సంబంధిత అధికారులతో పాటు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.

193 సదరం

సర్టిఫికెట్ల పునఃపరిశీలన

కాకినాడ క్రైం: జిల్లాలో సదరం సర్టిఫికెట్ల పునఃపరిశీలన కొనసాగుతోంది. రెండో రోజైన మంగళవారం కాకినాడ జీజీహెచ్‌, తుని ఏరియా ఆసుపత్రుల్లో ఈ ప్రక్రియ కొనసాగింది. పరిశీలనకు 198 మంది హాజరు కావలసి ఉండగా 193 మంది హాజరయ్యారు. గడచిన రెండు రోజుల్లో మొత్తం 378 సర్టిఫికెట్లను పరిశీలించారు.

బ్రాహ్మణ పురోహిత క్రికెట్‌

విజేత కాకినాడ రుద్రాస్‌

అమలాపురం రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్‌ టోర్నమెంట్‌లో కాకినాడ రుద్రాస్‌ జట్టు విజేతగా నిలిచింది. రన్నర్స్‌గా కొవ్వూరు గాయత్రీ ఎలెవెన్స్‌ విజయం సాధించింది. స్థానిక కిమ్స్‌ వైద్య కళాశాల క్రీడా ప్రాంగణంలో ఆర్గనైజింగ్‌ కమిటీ కర్ర బాబీ, ఉపద్రష్ట విజయ్‌, గంటి కోట సాయి ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ పది రోజుల పాటు కొనసాగింది. మంగళవారం జరిగిన ఫైనల్స్‌లో కొవ్వూరు గాయత్రీ ఎలెవెన్స్‌పై కాకినాడ రుద్రాస్‌ విజయం సాధించింది. రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షుడు కె.బుచ్చిరాంప్రసాద్‌, రాష్ట్ర పురోహిత గౌరవాధ్యక్షుడు పొదిలి నారాయణమూర్తి, అధ్యక్షుడు రాణి శ్రీనివాస్‌, రాష్ట్ర పురోహిత సమాఖ్య ప్రధాన కార్యదర్శి సుదర్శన్‌ దుర్గాబాబు, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఏవీ రమణ, ఎం.నరసింహమూర్తి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి చెల్లుబోయిన శ్రీనివాస్‌, మెట్ల రమణబాబు, అమలాపురం పట్టణాభివృద్ధి సంస్థ (అముడా) చైర్మన్‌ అల్లాడ స్వామినాయుడు తదితరులు విజేతలకు బహుమతులు అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement