ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ..
విద్యానగర్(కరీంనగర్): స్వర్ణకార పనులు ఎక్కువగా మగవారే చేస్తుంటారు. స్వర్ణకార కుటుంబానికి చెందిన గొట్టిముక్కుల ఉమాదేవి కులవృత్తిలో రాణించడంతో పాటు మరో ముగ్గురు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. కరీంనగర్‌లోని ద్వారకానగర్‌లో పదేళ్లుగా గోల్డ్ కాస్టింగ్, మౌల్డింగ్ పనులు చేస్తుండగా.. బంగారం, వెండి, పంచలోహాలతో వివిధ ఆభరణాలు, విగ్రహాలు కాస్టింగ్ చేయడం ఉమాదేవి ప్రత్యేకత. ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈ సౌకర్యం ఇక్కడే అందుబాటులో ఉండడంతో స్వర్ణకారులు వచ్చి తమకు కావాల్సిన ఆభరణాలు మౌల్డింగ్ చేయిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment