సునీల్‌రావుది భజన బ్యాచ్
కరీంనగర్ కార్పొరేషన్: బీజేపీలో మాజీ మేయర్ సునీల్‌రావుది భజన బ్యాచ్‌గా మారిందని సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. శనివారం నగరంలో మాట్లాడుతూ.. గట్టిగా బీజేపీ కండువా కూ డా వేసుకోని సునీల్‌రావు బీజేపీ తరఫున వకాల్తా పుచ్చుకోవడం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్‌లో సమన్వయం గురించి మాట్లాడడం అవివేకమని, బీజేపీలో సీనియర్ నాయకులు గుజ్జుల రామకృష్ణారెడ్డి, పి.సుగుణాకర్‌రావులు ఎందుకు కనిపించడం లేదో ఆయన చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి సాంకేతికం మాత్రమేనన్నారు.ఎన్నికల కమిషన్ ఓటర్లకు పూర్తిగా అవగాహన కల్పించినా, 01,02 అనే అంకెలను ఒప్పుకున్నా, ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా పదివేల మెజార్టీతో కాంగ్రెస్ గెలిచేదన్నారు. సీఎం,మంత్రులను విమర్శించి సంజయ్ ప్రాపకం సంపాదించేందుకు సునీల్‌రావు ప్రయత్నిస్తున్నాడన్నారు. కొరివి అరుణ్‌కుమార్, శ్రవణ్‌నాయక్ పాల్గొన్నారు.
● సుడా చైర్మన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment