● 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ● పేరుకుపోయిన బ
కరీంనగర్:
జిల్లా ట్రెజరీ కార్యాలయం నుంచి బిల్లుల మంజూరుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, ప్రజాప్రతినిధులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉద్యోగవిరమణ డబ్బులు, గృహావసరాలు, కార్యాలయాల నిర్వహణ బిల్లులు సకాలంలో అందడంలేదని చెబుతున్నారు. ఖజానా ఖాళీఅవడంతో అధికారులు ఇచ్చిన చెక్కులు కాంట్రాక్టర్లకు చెల్లుబాటు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్ల బిల్లులు అనధికార లెక్కల ప్రకారం 3వేల బిల్లులకు సంబంధించి రూ.200 కోట్లకుపైబడి చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. జిల్లా ట్రెజరీ పరిధిలో సుమారు 9వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, 12 వేల మందికిపైగా పింఛన్‌దారుల ఖాతాలు ఉన్నాయి. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండడంతో ట్రెజరీశాఖ లో బిల్లుల చెల్లింపుకు తాకిడి పెరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న చెక్కులు క్లియర్ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షన్‌దారులు కోరుతున్నారు.
నేరుగా ఖాతాల్లోకి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(ఐఎఫ్‌ఎంఐఎస్) ప్రవేశపెట్టారు. చెక్కుల వివరాల ను ఆన్‌లైన్‌లో ప్రభుత్వ ఆమోదానికి పంపిస్తారు. వీలును బట్టి చెక్కులను పాస్ చేసి నేరుగా ఆర్‌బీఐకి పంపిస్తారు. ఆ తర్వాత చెక్కులు పాసై... ఖాతాలో నేరుగా డబ్బులు జమవుతాయి. ఆన్‌లైన్ విధానం కావడంతో చెక్ వేసిన వారికి నిరీక్షణ తప్పడం లేదు. ఎవరిని అడిగే అవకాశముండదు. ఐఎఫ్‌ఎంఐఎస్ ద్వారా పంపిన చెక్కులను మళ్లీ సమర్పించేందుకు వీలుండదు. దీంతో సంబంధిత అధికారుల నుంచి కొత్త చెక్కులు తీసుకోవాల్సి వస్తోంది.
వేతనాలకే పరిమితం
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు తప్ప ఏవీ పాస్ కావడం లేదు. సరెండర్ లీవ్, జీపీఎఫ్, సప్లిమెంటరీ సాలరీస్ లాంటి బెనిఫిట్స్ అందక ఇబ్బందులు ప డుతున్నారు. దరఖాస్తు చేసిన ఉద్యోగులకు అయి దు నెలలైన అలవెన్స్ డబ్బులు అందడం లేదు. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలు, డెత్ రిలీఫ్ చెక్కులు పాస్ కావడం లేదు. గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్, ఆర్‌అండ్ పనుల చెక్కులన్నీ వెనుకకు పంపిస్తున్నారు. గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, ఇతర అభివృద్ధి పనుల చెక్కుల కోసం నిరీక్షించడడమే మాజీ సర్పంచ్‌ల వంతవుతోంది.
మంజూరుకు పంపిస్తున్నాం
విడతలవారీగా బిల్లుల చెల్లింపులకు కార్యాలయం నుంచి పంపిస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించిన అన్ని బిల్లులను ప్రభుత్వానికి వెంట వెంటనే నివేదిస్తున్నాం. ఈ– కుబేర్‌లో పొందుపరిచి ఉన్న సీరియల్ ప్రకారమే బిల్లులు పాసవుతాయి.ఉద్యోగుల బెన్‌ఫిట్స్‌కు సంబంధించిన బిల్లులు పెండింగ్ లేకుండా పంపిస్తున్నాం.
– నాగరాజు, జిల్లా ట్రెజరీ అధికారి
● 31వ తేదీతో ముగియనున్న ఆర్థిక సంవత్సరం ● పేరుకుపోయిన బ
Comments
Please login to add a commentAdd a comment