Bengaluru Techie-Model Suicide After Boyfriend Cheated, Boyfriend Arrested - Sakshi
Sakshi News home page

​​​​​​​ఈ లోకానికి వీడ్కోలంటూ..అమ్మా, గురు మామా క్షమించండి

Published Fri, Jul 28 2023 1:06 AM | Last Updated on Fri, Jul 28 2023 3:41 PM

- - Sakshi

యశవంతపుర: ప్రియుడు మోసం చేశాడని డెత్‌నోట్‌ రాసి మహిళా టెక్కీ ప్రాణాలు తీసుకున్న సంఘటన బెంగళూరు సోలదేవనహళ్లి సమీపంలోని కెంపాపురలో చోటు చేసుకొంది. మృతురాలు విద్యాశ్రీ (24). వివరాలు.. విద్యాశ్రీ, బసవేశ్వర నగరకు చెందిన అక్షయ్‌ అనే జిమ్‌ ట్రైనర్‌ ప్రేమలో ఉన్నారు. విద్యాశ్రీ టెక్కీగానే కాకుండా మోడల్‌గాను పనిచేసేది, కొన్ని అందాల పోటీల్లో గెలిచింది.

విద్యాశ్రీ నుంచి అక్షయ్‌ రూ.1.76 లక్షలు తీసుకున్నాడు. ఆమె ఇటీవల తనకు డబ్బులు వాపస్‌ ఇవ్వాలని అడిగింది. దీంతో గొడవకు దిగిన అక్షయ్‌ ఆమెను, కుటుంబసభ్యులను దూషించి వెళ్లిపోయాడు. ఆమె ఎన్నిసార్లు కాల్‌ చేసినా అతని ఫోన్‌ స్విచాఫ్‌ అని వచ్చింది. దీంతో ఆవేదనకు లోనైన విద్యాశ్రీ డెత్‌నోటు రాసి ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అమ్మా, గురు మామా క్షమించండి, ఎవరూ ప్రేమించవద్దు. గుడ్‌ బై టు దిస్‌ వరల్డ్‌ అని విద్యాశ్రీ డెత్‌ నోట్‌లో రాసింది. పోలీసులు నిందితుడు అక్షయ్‌ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement