యశవంతపుర: కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటంలో నిర్లక్ష్యం వహించిన బెంగళూరు పులకేశీనగర సీఐ సోమశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఆదేశాలున్న ప్రైవేట్ ఫిర్యాదుపై కేసును నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించటంతో సీఐ సోమశేఖర్ సస్పెండ్ చేశారు. దీంతో పాటు దోపిడీకి సంబంధించి కేసు నమోదు చేయకుండా, తన విధుల డైరీని సక్రమంగా నిర్వహించలేదని ఆరోపణలు వస్తున్నాయి.
75 కేసులు నమోదు
బెంగళూరు నగరంలో మద్యం సేవించి వాహనాలను నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. గురువారం ఒక్కరోజున 2804 మందిని తనిఖీ చేయగా 75 కేసులను నమోదు చేశారు. ఇందులో మద్యం తాగి వాహనాలను నడుపుతున్న 75 కేసులను నమోదు చేశారు.
వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న క్యాంటర్
దొడ్డబళ్లాపురం: వేగంగా వచ్చిన క్యాంటర్ వాటర్ ట్యాంకర్‌ను ఢీకొన్న ప్రమాదంలో వాటర్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తాపడ్డ సంఘటన దొడ్డ పట్టణ పరిధిలోని టీబీ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. టీబీ సర్కిల్ వద్ద ఉన్న గ్రామీణ అభ్యుదయ సేవా సంస్థ కార్యాలయం ముందు వాటర్ ట్యాంకర్ యూటర్న్ తీసుకుంటుండగా గౌరిబిదనూరు వైపు నుండి వేగంగా వచ్చిన క్యాంటర్ ఢీకొంది. దీంతో వాటర్ ట్యాంకర్ రోడ్డుపై బోల్తాపడింది. అయితే ప్రమాదంలో ఎవరికి ఎటువంటి అపాయం జరగలేదు.
Comments
Please login to add a commentAdd a comment