ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం

Published Wed, Jan 29 2025 12:58 AM | Last Updated on Wed, Jan 29 2025 12:58 AM

ఇల్లు

ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం

రాష్ట్రంలో రుణ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వడ్డీ మీద వడ్డీ విధించి చక్రవడ్డీలతో నడ్డీ విరుస్తున్నారు. సామాన్యులు ఆ భారం మోయలేక మరిన్ని ఇబ్బందుల్లో పడిపోతున్నాడు. ఇలా మైక్రో ఫైనాన్స్‌ అనేది విష వలయంగా తయారైంది. సహించేది లేదు, కఠిన చర్యలు తప్పవు అని సీఎం సిద్దరామయ్య హెచ్చరించినప్పటికీ ఎలాంటి కార్యాచరణ అమలులోకి రాలేదు.

మైసూరు: ఫైనాన్స్‌లో రుణాలు తీసుకొని చెల్లించక పోవడంతో సిబ్బంది వచ్చి ఇంటిలో ఉన్నవారిని వెళ్లగొట్టి తాళం వేశారు. కుటుంబం మొత్తం రోడ్డున పడిన అమానుష సంఘటన చామరాజనగర జిల్లాలోని సంతేమారహళ్ళి గ్రామంలో జరిగింది. రాజేష్‌, శ్వేత దంపతులు కొన్ని సంవత్సరాల నుంచి చామరాజనగర మైక్రో పైనాన్స్‌ సంస్థలో ఇంటిని కుదువ పెట్టి రూ. 15 లక్షల అప్పు తీసుకున్నారు. సకాలంలో వాయిదాలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్‌ సిబ్బంది వచ్చారు. అప్పు కట్టకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పి రాజేష్‌ దంపతులను బయటకు పంపించి ఇంటికి తాళం వేశారు. దాంతో ఆ కుటుంబం ఇంటిబయటే గడుపుతోంది.

కృష్ణమూర్తి ఆత్మహత్యపై విచారణ

మైక్రో ఫైనాన్స్‌ సంస్థ అప్పు చెల్లించాలని సతాయించడంతో మైసూరు జిల్లాలోని నంజనగూడు తాలూకాలోని మల్కుండి గ్రామానికి చెందిన కృష్ణమూర్తి ఆనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ఐదు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలపైన నంజనగూడు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అప్పు చెల్లించినా కూడా మరింత డబ్బు కట్టాలని ఆ సంస్థల సిబ్బంది వేధించారు. ఒక సంస్థ అప్పు కట్టడానికి మరో ఫైనాన్స్‌ నుంచి ఎక్కువ వడ్డీకి రుణం తీసుకునేవాడు. ఇలా చక్రబంధంలో చిక్కుకున్నాడు. చివరికి ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనాన్స్‌ సిబ్బందిని పోలీసులు పిలిచి విచారణ ప్రారంభించారు.

బెంగళూరులో ఫిర్యాదులు లేవు: కమిషనర్‌

బనశంకరి: మైక్రో ఫైనాన్ప్‌ వేధింపుల గురించి బెంగళూరులో ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు, ఫిర్యాదులు వస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ కమిషనర్‌ బీ.దయానంద్‌ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వేధింపుల పట్ల ప్రభుత్వం రెండుసార్లు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు చేసిందని చెప్పారు. వీటిని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఒత్తిళ్ల గురించి ఫిర్యాదులు వచ్చాయన్నారు. కానీ బెంగళూరులో ఫిర్యాదులు ఏవీ రాలేదన్నారు. ఒకవేళ ఫిర్యాదు అందిన తక్షణం స్పందించాలని ఆదేశించానన్నారు. బాధితులు 112 నంబరుకు కాల్‌ చేసి చెప్పవచ్చన్నారు. లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. అధిక వడ్డీ వసూలుకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించానన్నారు. రామమూర్తినగర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బంగ్లాదేశ్‌ మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

తాళం వేసిన ఇల్లు

అప్పు తీర్చలేదని ఇంటికి తాళం

చామరాజనగర జిల్లాలో అమానుషం

ఫైనాన్స్‌ ఆగడాలపై నిఘా: బెంగళూరు కమిషనర్‌

మండ్య: మండ్య జిల్లా మళవళ్ళి తాలూకాలో కోనాపుర గ్రామంలో ప్రేమ (59) అనే మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. చెన్నపట్టణలోని ప్రైవేటు బ్యాంకులో రూ.6 లక్షలను అప్పుగా తీసుకుంది. చాలా మొత్తం చెల్లించింది, కొన్ని కంతులు కట్టడం ఆలస్యం కావడంతో బ్యాంకు సిబ్బంది ఇంటికి వచ్చి వెంటనే అప్పు తీర్చకుంటే ఇంటిని జప్తు చేస్తామని హెచ్చరించారు. ఇంటికి తాళం వేయడంతో ప్రేమ బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడ ఉంటోంది. ప్రేమ మంగళవారం ఇంటి వద్దకు వచ్చి తనకు న్యాయం స్థానికులను కోరుతూ నిద్రమాత్రలు మింగింది. స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రమాదం తప్పింది. మెరుగైన చికిత్స కోసం మండ్యలోని మిమ్స్‌లో చేర్పించారు. హలగూరు పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం 1
1/2

ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం

ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం 2
2/2

ఇల్లు జప్తు, మహిళ ఆత్మహత్యాయత్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement