ఏరో ఇండియాకు ఏర్పాట్లు
దొడ్డబళ్లాపురం: నగరంలో యలహంకలోని భారతీయ వైమానిక స్థావరంలో ఫిబ్రవరి 10 నుంచి 14వ తేదీ వరకూ ఏరో ఇండియా ప్రదర్శన జరగనుంది. ప్రదర్శనకు సొంత వాహనాలలో కాకుండా సిటీ బస్సుల్లో రావాలని, అప్పుడే ట్రాఫిక్ సమస్య తగ్గుతుందనని నిర్వాహకులు తెలిపారు. ఎయిర్ షోలో విమానాల విన్యాసాల కారణంగా కెంపేగౌడ విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలకు ఆటంకం కలగనుంది. దీనివల్ల అక్కడ సర్వీసులను మార్చే అవకాశముంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకూ, మళ్లీ మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 వరకూ కెంపేగౌడ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలను నిలిపివేస్తారని తెలిసింది. మళ్లీ 9, 10, 12 తేదీల్లో ఇదే మాదిరిగా పౌర విమానాల రాకపోకలను బంద్ చేస్తారని వాయుసేన వర్గాలు తెలిపాయి. ఈ ప్రదర్శనకు ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
కొన్నిరోజులు పౌర విమానాలకు ఆటంకం
Comments
Please login to add a commentAdd a comment