శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాను కుంభమేళాలో గంగా స్నానం గురించి విమర్శించడం తగదని ఏఐసీసీ అధ్యక్షుడు ఎం.మల్లికార్జున ఖర్గేపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర ధ్వజమెత్తారు. మీ పెద్దరికాన్ని బానిసత్వ పార్టీకి తాకట్టుపెట్టినట్లు ప్రవర్తిస్తున్న తీరుపై జాలి కలుగుతోందని ఎక్స్‌లో విమర్శించారు. అవినీతి, స్వజన పక్షపాతం, హత్య, దోపిడీ, అత్యాచారాలు, ఉగ్రవాద కార్యకలాపాలు కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ పాలనలో తాండవిస్తున్నాయని దుయ్యబట్టారు. పట్టపగలే బ్యాంకు దోపిడీలు జరుగుతున్నాయి, అప్పులు తీసుకున్న వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment