వేసవికి ముందే ఉ–కకు జల క్షామం?
రాయచూరు రూరల్: గత ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసినా వేసవిలో ఉత్తర కర్ణాటక(ఉ–క)కు జల క్షామం ఏర్పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. విజయపుర జిల్లా ఆల్మట్టి డ్యాంలో ఆశించినంత మేర నీటి లభ్యత లేదనే విషయం తేటతెల్లమవుతోంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జలాశయంలో నీటి నిల్వ తక్కువగా ఉంది. డ్యాం గరిష్ట స్థాయి నీటిమట్టం 519.60 మీటర్లు, 123.081 టీఎంల నీటి సామర్థ్యం కాగా ప్రస్తుతం నీటిమట్టం 513.70 మీటర్లు, 52.424 టీఎంసీల నీటి నిల్వ ఉంది. డెడ్ స్టోరేజీ 17.62 టీఎంసీలు, మిగిలిన 34.804 టీఎంసీల నీటిని ఈ నెలాఖరు వరకు కాలువలకు వదలాలి. గత ఏడాది 516.08 మీటర్లు, 73.838 టీఎంసీల నీటి నిల్వ ఉండేది. ఈ ఏడాది డ్యాంలో 21.414 టీఎంసీల నీటి నిల్వ తక్కువగా ఉంది. ఏప్రిల్, మే, జూన్ వరకు ఆల్మట్టి డ్యాం నుంచి విజయపుర, బాగల్కోటె, యాదగిరి, కలబుర్గి, రాయచూరు జిల్లాల్లోని తాగునీటి పథకాలకు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. గతంలో రైతుల కోరిక మేరకు నీటి వాటా లభ్యత ఆధారంగా రబీ సీజన్లో వేసుకున్న పంటలకు నీటిని విడుదల చేయాలని కేబీజీఎన్ఎల్ చీఫ్ ఇంజినీర్ సురేష్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment