
సిద్ధగంగ మఠం జన సాగరం
తుమకూరు: లక్షల మంది బాలలకు చదువు, అన్నం, విద్యా ఆశ్రయం కల్పించి నడిచే దేవునిగా కీర్తి పొందిన తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత దివంగత శివకుమార స్వామి 118వ జయంతి వేడుకలు, గురువందన మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగాయి. సిద్ధగంగా మఠంలో వేలాది మంది భక్తులు, సాధుసంతులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెల్లవారుజామునుంచే మఠంలో స్వామీజీ సమాధి వద్ద వివిధ పూజలు చేపట్టారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కేంద్ర మంత్రి వి.సోమన్న, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మఠాధిపతి సిద్ధలింగస్వామి పాల్గొన్నారు. సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పల్లకీ ఊరేగింపు
మైసూరు సుత్తూరు మఠం స్వామి శివరాత్రి దేశికేంద్ర స్వామి పూలు పండ్లు తీసుకువచ్చి సమాధికి సమర్పించి పూజలు గావించారు. తరువాత శివకుమారస్వామి విగ్రహాన్ని పల్లకీలో ఉంచి మఠంలో ఊరేగించారు. వేలాదిగా భక్తులు పాల్గొన్నారు. జానపద కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా సేవా ట్రస్టు ఆధ్వర్యంలో 118 మంది చిన్నారులకు నామకరణోత్సవం, అక్షరాభ్యాసం చేయించారు. ఆ శిశువులకు ఉచితంగా ఉయ్యాలలు, ఇతర సామగ్రిని అందజేశారు. అశేష భక్తజనానికి మఠంలో భోజన వ్యవస్థ కల్పించారు. తుమకూరు నగరంలోనూ అనేకచోట్ల స్వామీజీ భక్తులు అన్నదానం చేశారు.
వైభవంగా శివకుమారస్వామి
118వ జయంతి ఉత్సవాలు
కేంద్ర రక్షణమంత్రి, మంత్రులు హాజరు

సిద్ధగంగ మఠం జన సాగరం

సిద్ధగంగ మఠం జన సాగరం

సిద్ధగంగ మఠం జన సాగరం