
వాటర్ బూస్టర్ కేంద్రాల్లో తనిఖీ
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి ఎద్దడి నెలకొనడంతో రాంపుర జలాశయం, చిక్కసూగూరు, యరమరస్‌ల్లోని వాటర్ బూస్టర్ కేంద్రాలను నగర శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, నగరసభ సభ్యులు, అధికారులతో కలసి పరిశీలించారు. శుక్రవారం గణేకల్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. రాంపుర జలాశయానికి నీరు చేరుకున్న నేపథ్యంలో నగరానికి తాగునీటిని అందించే రాంపూర్ చెరువులోని నీటిని వృథా చేయకుండా వినియోగించాలని సిబ్బందికి సూచించారు. నగరసభ సభ్యుడు శశిరాజ్, నాగరాజ్, నేతలు రవీంద్ర జాలదార్, నరసింహులు, ఆంజనేయ, శ్రీనివాసరెడ్డి, ఉప కమిషనర్ గురుసిద్దయ్యలున్నారు.