
ఘనంగా జంబునాథ స్వామి రథోత్సవం
హొసపేటె: నగర శివార్లలోని పురాతన కాలపు జంబునాథ స్వామి ఆలయ రథోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామి వారికి పంచామృతాభిషేకం, అర్చనలతో పాటు ప్రత్యేక పూజలు నెరవేర్చారు. స్వామి వారికి పూలమాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. సాయంత్రం రథోత్సవం జరిపారు. రథోత్సవాన్ని తిలకించేందుకు నగరంలోని వివిధ వార్డుల నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రథోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ శ్రీహరిబాబు ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.