
రేణుకా యల్లమ్మ రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లాలోని ఆనేకల్ తాలూకాలోని సర్జాపురలో గ్రామ దేవత శ్రీరేణుకా యల్లమ్మ దేవి ఆలయ బ్రహ్మ రథోత్సవం గురువారం నేత్రపర్వంగా జరిగింది. తెల్లవారుజామునే అమ్మవారి మూల విరాట్‌తో పాటు ఉత్సవమూర్తికి ప్రత్యేక అలంకారం చేసి పూజలు నిర్వహించారు. రాజేశ్వర శివాచార్య స్వామి, తమిళనాడు శివానందశివాచార్య స్వామి విశేష పూజల్లో పాల్గొన్నారు. ఉత్సవమూర్తులను తేరులో ఆసీనుల్ని చేసి రథాన్ని లాగారు. ప్రముఖ వీధుల్లో కోలాహలం మధ్య తేరు ఊరేగింది. వివిధ జానపద కళాకారుల ప్రదర్శనలు, డప్పు వాయిద్యాలు అలరించాయి.
సర్జాపురలో కోలాహలం