రాయచూరు రూరల్: మనిషి భక్తిభావం పెంపొందించుకున్నప్పుడే జీవితం ధన్యం అవుతుందని ఎలె బిచ్చాలి మఠాధిపతి వీరభద్ర శివాచార్య పేర్కొన్నారు. సిరవార తాలూకాలోని అత్తనూరు సోమవారపేట హిరేమఠ్ రాచోటి వీర శివాచార్యుల 21వ పుణ్యారాధన ఉత్సవాల్లో భాగంగా సామూహిక వివాహాల్లో పాల్గొన్న 11 జంటలను ఆశీర్వదించి ఆయన మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మదనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు కర్బూజ పండ్లను దానం చేశారు. కార్యక్రమంలో గబ్బూరు బృహన్మఠ బూది బసవేశ్వర శివాచార్య, మహాలింగ, శాంతమల్ల శివాచార్య, చెన్న బసవ శివాచార్య, మహాంత శివాచార్య, వీర సంగమేష్ శివాచార్య స్వామీజీ, మాజీ శాసన సభ్యుడు పాపారెడ్డి, మహంతేష్ పాటిల్, సూగప్ప తదితరులున్నారు.