
ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణలో మాట్లాడుతున్న డీఈఓ శర్మ
నేలకొండపల్లి: పాఠశాలలు పచ్చగా కళకళలాడాలని మొక్కలు నాటుతుండగా.. కొన్నిచోట్ల ఏపుగా పెరిగిన చెట్లను తెగనరుకున్నారు. నేలకొండపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వంట గది నిర్మాణానికి అధికారులు దగ్గర ఉండి మరీ చెట్లను నరికించారు. ఈ విషయాన్ని మంగళవారం గుర్తించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. ఈవిషయమై హెచ్‌ఎం లక్ష్మిని వివరణ కోరగా తనకు సమాచారం ఇవ్వకుండా చెట్లను నరకడంతో ఎంఈఓ బి.రాములుకు ఫిర్యాదు చేశారు.
పాఠశాలల్లో డీఈఓ తనిఖీ
కారేపల్లి: కారేపల్లి మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను డీఈఓ సోమశేఖరశర్మ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థుల ప్రీ ఫైనల్ పరీక్షలు, ప్రత్యేక తరగతుల నిర్వహణపై సమీక్షించారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఆతర్వాత కారేపల్లి హైస్కూల్‌లో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ తరగతులను కూడా డీఈఓ సందర్శించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంలు పవన్‌కుమార్, ఎం.శ్రీనివాసరావు, కాలేశ్వరరావు, ఎఫ్‌ఎల్‌ఎన్ ట్రెయినర్లు దామోదరరావు, మూన్యా, మోహన్, సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.