ఇక మున్సిపల్‌ పాలన | - | Sakshi
Sakshi News home page

ఇక మున్సిపల్‌ పాలన

Published Wed, Jan 29 2025 12:44 AM | Last Updated on Wed, Jan 29 2025 12:44 AM

ఇక ము

ఇక మున్సిపల్‌ పాలన

ఖమ్మంరూరల్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఏదులాపురం మున్సిపాలిటీ కల నెరవేరింది. మండలంలోని ఏదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుచేయనున్నట్లు గతంలోనే ప్రకటించినా మంగళవారం ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. గతంలో ఖమ్మం మున్సి పల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన ఐదు పంచాయతీలకు తోడు కొత్తగా మరో ఏడు గ్రామాలను కలుపుకుని మున్సిపాలిటీగా అవతరించింది.

నెలల క్రితమే సర్వే

పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కలెక్టర్‌ ముజుమ్మిల్‌ఖాన్‌ సూచనలతో రూరల్‌ ఎంపీడీఓ సర్వే చేసి ఏదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తూ నివేదిక సమర్పించారు. దీంతో రూరల్‌ మండలంలోని ఏదులా పు రం, పెదతండా, వెంకటగిరి, గుర్రాలపాడు, గుది మళ్ల, మద్దులపల్లి, తెల్దారుపల్లి, గొల్లగూడెం, బారుగూడెం, ముత్తగూడెం, పోలేపల్లి పంచాయతీలోని రాజీవ్‌ గృహకల్ప, పల్లెగూడెం పంచాయతీలోని రెడ్డిపల్లిని కలుపుతూ నూతన మున్సిపాలిటీ ఏర్పాటైంది. ఈమేరకు తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని స్థానికులు ఆశిస్తున్నారు.

ఏదులాపురం కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు

12 గ్రామపంచాయతీల విలీనంతో ఏర్పాటు

ప్రత్యేకాధికారి, కమిషనర్‌తో పాటు ఉద్యోగుల నియామకం

కొత్త మున్సిపాలిటీ వివరాలు

విస్తీర్ణం 69.771 చ.కి.మీ.

గృహాలు 18, 967

జనాభా 56,697

ఓటర్లు 44,073

వ్యవసాయ భూమి 10, 805 ఎకరాలు

వ్యవసాయాధారిత

కుటుంబాలు 4,849

అధికారుల నియామకం

జిల్లాలోని సత్తుపల్లి, వైరా, మధిర మున్సిపాలిటీల్లో పాలకవర్గాల పదవీకాలం ఇటీవల ముగియడంతో అదనపు కలెక్టర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఇక కొత్త మున్సిపాలిటీ ఏదులాపురానికి ప్రత్యేకాధికారిగా కేఎంసీ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యను నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో వెల్లడించింది. అలాగే, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా కేఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ అహ్మద్‌ షఫీఉల్లా, ఏఈగా యాకూబ్‌అలీ, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా ఆర్‌.సంతోష్‌, సీనియర్‌ అకౌంటెంట్‌గా సతీష్‌కుమార్‌ను నియమించారు. ఈమేరకు ఏదులాపురం జీపీ రికార్డులను మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకోగా కమిషనర్‌గా షఫీఉల్లా బాధ్యతలు స్వీకరించారు. మిగతా గ్రామాల రికార్డులను వచ్చేనెల 6వ తేదీలోగా స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. కాగా, కొత్త మున్సిపల్‌ కార్యాలయాన్ని ఖరారు చేసేవరకు ప్రస్తుత ఏదులాపురం గ్రామపంచాయతీ కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగనున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
ఇక మున్సిపల్‌ పాలన1
1/1

ఇక మున్సిపల్‌ పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement