‘వనజీవి’ దంపతులను సన్మానించిన సీఎం
ఖమ్మంరూరల్: ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, వనజీవి(దరిపల్లి) రామయ్య – జానకమ్మను సీఎం రేవంత్‌రెడ్డి, సినీనటుడు చిరంజీవి సన్మానించారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో మంగళవారం ప్రత్యేక కార్యక్రమంలో వారిని వేదికపైకి ఆహ్వానించి సన్మానించిన సీఎం మాట్లాడారు. రైతు కుటుంబం నుండి వచ్చి రామయ్య లక్షలాది మొక్కలు నాటి పర్యావరణానికి తోడ్పాటునందిస్తుండడంతో పద్మశ్రీ అవార్డు దక్కిందని తెలిపారు. అనంతరం ఆయనకు చెక్కు అందజేశారు.
వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ
ఖమ్మం రాపర్తినగర్: జిల్లా యువజన, క్రీడా శాఖ ఆధ్వర్యాన యువతకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. కంప్యూటర్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో మూడు నెలల శిక్షణ అనంతరం సెట్విన్ ద్వారా పరీక్ష నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేస్తామని డీవైఎస్ఓ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు విద్యార్హత, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ ఫొటో జతపరిచిన దరఖాస్తును జిల్లా యువజన క్రీడా కార్యాలయంలో ఫిబ్రవరి 1లోగా అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు 99482 07271 నంబర్లో సంప్రదించాలని డీవైఎస్ఓ తెలిపారు.
జిల్లా రెవెన్యూ అధికారిగా పద్మశ్రీ
ఖమ్మం సహకారనగర్: జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా ఏ.పద్మశ్రీ నియమితులయ్యారు. కొన్నాళ్లుగా డీఆర్వో పోస్టు ఖాళీగా ఉండడంతో రాజేశ్వరి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనేపథ్యాన మెదక్ డీఆర్వోగా పనిచేస్తూ సెలవులో ఉన్న పద్మశ్రీని ఖమ్మంకు కేటాయించగా ఆమె మంగళవారం విధుల్లో చేరారు. అనంతరం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను ఆమె కలవగా, కలెక్టరేట్ ఉద్యోగులు డీఆర్వోకు శుభాకాంక్షలు తెలిపారు.
మైనార్టీ సంక్షేమాధికారిగా పురంధర్
ఖమ్మంమయూరిసెంటర్: జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిగా డాక్టర్ బోడేపూడి పురంధర్ మంగళవారం విధుల్లో చేరారు. తొలుత కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ప్రస్తుతం ఇన్చార్జ్గా ఉన్న ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ నుండి బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పశు సంవర్థక శాఖ అధికారిగా పని చేస్తున్న ఫురంధర్ను ప్రభుత్వం డిప్యూటేషన్‌పై ఖమ్మంకు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment